వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Air India: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. అత్యవసరంగా ల్యాండ్..

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి.

|
Google Oneindia TeluguNews

శుక్రవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో అబుదాబి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటన ప్రకారం "ఈరోజు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ B737-800 ఎయిర్‌క్రాఫ్ట్ VT-AYC ఆపరేటింగ్ ఫ్లైట్ IX 348 (అబుదాబి-కాలికట్ ) నం.1 ఇంజిన్ మంటల కారణంగా ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుంది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో 1000 అడుగుల ఎత్తులో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి" అని పేర్కొంది.

కాలికట్

కాలికట్

దీంతో అబుదాబి ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానం అబుదాబి నుంచి కాలికట్ వెళ్లాల్సిన వెళ్లాల్సి ఉంది. " ఇంజిన్ లో మంటలు చెలరేగినా విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పిల్చుకున్నారని" అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. వారం వ్యవధిలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడం ఇది రెండోసారి.

షార్జా

షార్జా

జనవరి 29న, షార్జా నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 8.04 గంటలకు పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

తిరువనంతపురం

తిరువనంతపురం

జనవరి 23న, తిరువనంతపురం నుండి ఒమన్‌లోని మస్కట్‌కు మరో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆన్‌బోర్డ్ కంప్యూటర్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి ల్యాండ్ అయింది.

English summary
An Air India Express flight made an emergency landing at the Abu Dhabi airport on Friday after an engine caught fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X