వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ పేరుతో రష్యా యువతిని తల్లిని చేసిన ఆంధ్రప్రదేశ్ యువకుడు, మాయం, చివరికి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి విదేశీ యువతిని మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడిని కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, కారవార పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కిరణ్ అనే యువకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

రష్యాకు చెందిన యువతి రెండు సంవత్సరాల క్రితం దక్షిణ కన్నడ జిల్లా చేరుకుని గోకర్ణలోని ఓ రిసార్టులో నివాసం ఉంటున్నది. రష్యా యువతిని కిరణ్ పరిచయం చేసుకున్నాడు. రష్యా యువతితో కిరణ్ సన్నిహితంగా ఉన్నాడు.

An Andhra Pradesh man cheated to Russian women in Karnataka.

పెళ్లి చేసుకుంటానని రష్యా యువతిని నమ్మించిన కిరణ్ ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. రష్యా యువతి గర్బవతి అయ్యింది. కిరణ్ కారణంగా రష్యా యువతికి బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తరువాత పెళ్లి చేసుకోవడానికి కిరణ్ నిరాకరించాడు.

ఊరికి వెళ్లి వస్తానని కిరణ్ మాయం అయ్యాడు. కిరణ్ మోసం చేశాడని బాధితురాలు రెండు నెలల క్రితం కారవార మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రెండు నెలల నుంచి కిరణ్ కోసం గాలించిన పోలీసులు చివరికి అతన్ని ఆంధ్రప్రదేశ్ లో గుర్తించి అరెస్టు చేసి కారవార తీసుకువచ్చారు. కిరణ్ ను కోర్టులో హాజరుపరిచి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
An Andra Pradesh man cheated to Russian woman in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X