వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై మరో ఐఈడీ దాడి...కొనసాగుతున్న కాల్పులు

|
Google Oneindia TeluguNews

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణం నెలకొంది. అయితే ఉగ్రవాదుల దాడిలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. 44 రాష్ట్ర్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆర్మ్‌డ్ కాన్వాయ్ పై పుల్వామా జిల్లాలోని అరిహల్ గ్రామం సమీపంలో ఈ దాడి జరగినట్టు సమాచారం.. మరోవైపు దాడి జరిగిన ప్రదేశంలో కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

ఇటివల కశ్మీర్‌లోని ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తీవ్రవాది జకీర్ మూస మ‌ృతికి నిరసనగా ప్రతికారదాడులకు తీర్చుకునేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్దంగా ఉన్నాయనే సమాచారం మేరకు కశ్మీర్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ తీవ్రవాదీ బుర్హాన్ వాణి ప్రధాన అనుచరుడు జకీర్ మూస మే 24న జరిగిన భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మ‌ృత్యువాత పడ్డాడు. దీంతో ఆ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మరోసారి ఉగ్రవాదులు పుల్వామా, మరియు అవంతిపోర జిల్లాలో గతంలో పుల్వామాలో తరహాలో జరిగిన ఐఈడీ దాడులు జరగవచ్చని ఇంటలీజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

An army vehicle was targeted with an ied in Jammu and Kashmirs Pulwama

కాగా పాకిస్థాన్‌ కూడ ఉగ్రవాదుల దాడులకు సంబంధించి ఎస్‌సీవో సమావేశంలోనే భారత్‌కు సమాచారం అందించారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించి, జాతీయ రహదారులపై భద్రతను పటిష్టం చేశారు.ఈనేపథ్యంలోనే ఉదయమే అనంతనాగ్ జిల్లాలో సెర్చ్ పరేషన్ చేపట్టిన భద్రతా దళాల దాడుల్లో ఓ ఆర్మీ అధికారి కూడ మృతి చెందారు.

English summary
An army vehicle was targeted with an improvised explosive device today in Jammu and Kashmir's Pulwama, where a convoy of the Central Reserve Police Force was attacked by a suicide bomber in February. There is no report of casualty. An encounter is on, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X