వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూల‌తోట‌ను త‌ల‌పించే ఆటో! వేస‌విలో గిరాకీ ఎక్కువేన‌ట‌!

|
Google Oneindia TeluguNews

పుణే: సాధార‌ణంగా ఎండా కాలంలో ఆటోల‌పై గోనెసంచుల‌ను క‌ప్పేస్తుంటారు డ్రైవ‌ర్లు. చ‌ల్ల‌ద‌నం రావ‌డానికి వాటిపై నీళ్లు చ‌ల్లుతుంటారు. మ‌హారాష్ట్ర‌లోని పుణేకు చెందిన ఓ ఆటో డ్రైవ‌ర్ కాస్త డిఫ‌రెంట్‌గా ఆలోచించాడు. ఎండ వేడి త‌గ‌ల‌కుండా ఆటోను పూల‌తోట‌లా మార్చేశాడు. రోడ్డు మీద వెళ్తోంటే ఆ ఆటో ఓ క‌దులుతున్న పూల తోట‌లా క‌నిపిస్తుంటుంది జ‌నానికి.

ఇలా వెరైటీగా ఆలోచించిన ఆ డ్రైవ‌ర్ పేరు ఇబ్ర‌హీం ఇస్మాయిల్ థంబోలి. పుణేలోని ర‌వివార్ పేట్‌లో నివాసం ఉంటున్నాడు. వ‌య‌స్సు 45 సంవ‌త్స‌రాలు. పాతికేళ్ల నుంచీ ఆటోను న‌డిపిస్తున్నాడు. వేసవి సీజ‌న్‌లో ఎండ వేడిమిని భ‌రించ‌లేక ఆటో ఎక్కే ప్ర‌యాణికులు ఎవ‌రూ క‌నిపించర‌ని, దీనివ‌ల్ల త‌న రోజువారీ ఆదాయం ప‌డిపోతుంటుంద‌ని ఆందోళ‌న చెందాడు.

An Auto Driver resident of Raviwar Peth in Pune City

ఈ గండం నుంచి గ‌ట్టెక్క‌డానికి మొద‌ట్లో ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫలితాల‌ను ఇవ్వ‌లేదు. దీనితో- త‌న సృజ‌నాత్మ‌క‌త‌ను ప‌దును పెట్టాడు. ఆటో మొత్తాన్నీ పూల‌తోట‌లా మార్చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా త‌న నిర్ణ‌యాన్ని అమ‌లు పెట్టాడు. మార్కెట్‌లో ల‌భించే ప్లాస్టిక్ గ‌డ్డి, పూలు, అల్లుకు పోయే గుణం ఉన్న మొక్క‌ల‌ను కొనుగోలు చేశాడు. వాటితో త‌న ఆటోను అలంక‌రించాడు.

An Auto Driver resident of Raviwar Peth in Pune City

త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌కృతి అంటే ఇష్ట‌మ‌ని, త‌న ఆటోను కూడా అలాగే అలంక‌రించ‌డం ఆనందాన్నిస్తోంద‌ని ఇబ్ర‌హీం చెబుతున్నాడు. వేస‌విలో గిరాకీ కూడా త‌గ్గ‌ట్లేద‌ని, ఈ త‌ర‌హా ఆటోలో ప్ర‌యాణించ‌డానికి ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపుతున్నార‌ని ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌యాణికులు ఆటోతో సెల్పీలు కూడా తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నార‌ని, ఫ‌లితంగా- త‌న‌కు డిమాండ్ ఏర్ప‌డింద‌ని ఇబ్ర‌హీం వెల్ల‌డించాడు.

English summary
A 45-year-old resident of Raviwar Peth has converted his autorickshaw in a way that gives passengers and onlookers a feel of nature. Ibrahim Ismail Tamboli’s love for nature and concern about climate change is reflected in his vehicle. I was attracted to nature from childhood. We will be wiped off the face of this planet if nature is not conserved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X