వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో యుద్ధవాతావరణ సమయంలో కార్గిల్‌ యుద్ధక్షేత్రంలో కంపించిన భూమి: 3 రోజుల్లో రెండోసారి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ సహా పలు దేశాల్లో కొద్దిరోజులుగా వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఒక దేశంలో.. ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తోంది. స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. దేశ రాజధాని ప్రాంతంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొంటున్నాయి. న్యూఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) సహా పలు ప్రాంతాల్లో వరుసగా కొద్దో, గొప్పో భూమి ప్రకంపిస్తూనే వస్తోంది. ఢిల్లీ, గుర్‌గావ్, నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో తరచూ భూప్రకంపనలు నమోదవుతున్నాయి.

తాజాగా కేంద్రపాలిత ప్రాంతం లఢక్‌లోని కార్గిల్ యుద్ధ క్షేత్రంలో భారీ భూప్రకంపనలు నమోదు అయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైంది. కార్గిల్‌కు ఆగ్నేయ దిశలో ఈ తెల్లవారు జామున 3 గంటల 37 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు జాతీయ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. మూడురోజుల వ్యవధిలో కార్గిల్, లఢక్ ప్రాంతాల్లో భూకంపం నమోదు కావడం ఇది రెండోసారి కావడం ఆందోళనలను కలిగిస్తోంది.

 Coronavirus: చైనాతో చెక్క భజన, విదేశాంగ మంత్రికి కట్నకానుకలు ఇచ్చిన కరోనా, అయ్యో పాపం! Coronavirus: చైనాతో చెక్క భజన, విదేశాంగ మంత్రికి కట్నకానుకలు ఇచ్చిన కరోనా, అయ్యో పాపం!

An earthquake with a magnitude of 4.7 on hit NNW of Kargil, Ladakh

కార్గిల్‌కు ఉత్తర, ఆగ్నేయ దిశలో 433 కిలోమీటర్ల దూరం గల ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు సెస్మాలజీ సెంటర్ పేర్కొంది. ఈ నెల 2వ తేదీన కూడా లఢక్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైంది. అదే రోజు లఢక్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోనూ భూమి ప్రకంపంచింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైనట్లు సెస్మాలజీ సెంటర్ పేర్కొంది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 3.5 మాగ్నిట్యూడ్‌తో భూమి ప్రకంపించింది.

Recommended Video

Panic in Hyderabad as Top Jeweller Party With Hundreds of Attendees Got Corona || Oneindia Telugu

శుక్రవారం సాయంత్రం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 7 గంటలకు భారీగా భూప్రకంపనలు నమోదుఅ్యాయి. హర్యానా, రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో.. ప్రత్యేకించి ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో తరచూ సంభవిస్తోన్న భూకంపాలు మున్ముందు ఎలాంటి విపత్కర, విధ్వంసకర పరిస్థితులకు దారి తీస్తాయోననే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

English summary
An earthquake of magnitude 4.7 on the Richter scale struck Kargil in Ladakh at 3.37 am on Sunday (July 5, 2020).The quake struck 433 km north-northwest of Kargil. "An earthquake with a magnitude of 4.7 on the Richter Scale hit 433km NNW of Kargil, Ladakh today at 3:37 am," said National Center for Seismology (NCS). Earlier on Thursday, another earthquake of magnitude 4.5 on the Richter scale had struck Kargil in Ladakh at 1.11 pm. The quake had struck 119 km north-northwest of Kargil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X