వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. గజ"రాజు" వేడుకలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

లక్నో : ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సందర్భంగా వేడుకలు కూడా జరిగాయి. ఏనుగేంటి, స్వాతంత్ర్యమేంటి, అసలు ఈ వేడుకలు ఏంటని ఆశ్యర్యపోతున్నారా. మీ అనుమానంలో తప్పు లేదు.. అలాగే ఈ వార్తలో కూడా అలాంటి తప్పేమీ లేదు. మీరు చదివింది నిజమే.. మేము రాసింది నిజమే.

50 సంవత్సరాలుగా ఓ వ్యక్తి చేతిలో బందీగా ఉంది ఈ ఏనుగు. గజరాజును అడ్డు పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్లమీద తిరుగుతూ భిక్షమెత్తుకుంటున్నాడు. ఎండనక, వాననక ఆ వ్యక్తి చేతిలో అలా యాభై ఏళ్ల పాటు బందీగానే ఉండిపోయింది ఐరావతం. అయితే అన్నీ సంవత్సరాలు ఆ యాచకుడు దాన్ని రోడ్లపై తిప్పుతూనే ఉన్నాడు.

పల్లెగా మారనున్న పట్నం.. బోనాల జాతర ప్రారంభం.. ఇక నెలరోజులు సందడేపల్లెగా మారనున్న పట్నం.. బోనాల జాతర ప్రారంభం.. ఇక నెలరోజులు సందడే

An elephant rescued from captivity to celebrate its 5 years freedom

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై ఏళ్లు ఈ గజరాజు అతడి చేతిలో బందీగా ఉన్న విషయం వైల్డ్ లైఫ్ ఎస్‌వోఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు తెలిసింది. దాంతో వారు రంగంలోకి దిగి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అలా ఆ యాచకుడి నుంచి 2014వ సంవత్సరంలో గజరాజును స్వాధీనం చేసుకుని మధురలోని ఏనుగుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడే దాని బాగోగులు చూస్తున్నారు.

An elephant rescued from captivity to celebrate its 5 years freedom

అలా విముక్తి పొందిన ఏనుగుకు రాజు అని పేరు పెట్టారు. అయితే దాన్ని రక్షించి ఐదేళ్లు అవుతున్న సందర్భంగా వైల్డ్ లైఫ్ ఎస్‌వోఎస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వేడుకలు నిర్వహించారు. కేక్ కోసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఏనుగు ముందర కేక్ పెట్టడంతో ఆరగించింది.

English summary
An elephant that was formerly kept in captivity celebrated five years of freedom with a sweet ceremony organised for him. Popularly known as Raju, the elephant spent the first five decades of his life roaming the streets of Uttar Pradesh seeking alms for his owner, while being kept in custody illegally. In 2014, the NGO Wildlife SOS successfully rescued the animal and treated him to a healthy ‘cake’ this year to celebrate his freedom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X