గోడౌన్‌పై కుప్పకూలి ఏఫ్ -16 జెట్ యుద్ద విమానం..
సౌత్ కాలిఫోర్నియాలో ఓ ట్రైనింగ్ ఎఫ్ 16 జెట్ ఫైటర్ వేర్‌హౌజ్ పైకప్పుపై కూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ ప్యారాచూట్ ద్వార క్రిందకు దూకి కొద్ది పాటి గాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డాడు. కాగా వేర్హజ్ లో ఉన్న వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన గురవారం తెల్లవారుజామున జరిగినట్టు తెలుస్తోంది. కాగా కాలీఫోర్నీకు 100 దూరంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ సమయంలో ప్రమాదం జరిగింది. అకడామీలో సాధారణంగా సుమారు 2000 నుండి 6000 మంది వరకు పైలట్లకు శిక్షణ కొనసాగుతోంది.కాగా ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ జరిపిస్తున్నారు.
కాగా ఎఫ్ -16 ఫైటర్ జెట్ ప్రపంచంలోనే చాల ప్రాముఖ్యత కల్గిన విమానం. ఇవి ప్రపంచవ్యప్తంగా మొత్తం 25 దేశాల్లో సుమారు 4500 వరకు ఉంటాయి.అత్యంత అధునూతమైన సాంకేతిక పరిజ్ఝానంతో దీన్ని నిర్మాణం ఉంటుంది.ప్రమాదం జరిగిన తర్వాత నార్త్ -సౌత్ రూట్‌ను మూసి వేసినట్టు అధికారులు తెలిపారు.