• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Viral video: యూపీ పంచాయతీ ఎన్నికల్లో హింస: మహిళ అభ్యర్థిని వివస్త్రను చేసే ప్రయత్నం

|

లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఉత్తర ప్రదేశ్‌లో బ్లాక్ పంచాయతీ పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పోలీసుల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఉత్తర ప్రదేశ్‌లో పలు చోట్ల పోలీసులు, కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. కొన్ని చోట్ల పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. జర్నలిస్టులపైనా లాఠీ ఝుళిపించారు. ఈ ఘర్షణలను చిత్రీకరించడానికి వెళ్లిన టీవీ రిపోర్టర్లనూ వదిలి పెట్టలేదు.

YS Sharmila: దొర దిగొచ్చిండు గానీ: 50 వేలు కాదు..లక్షా 90 వేలు: పోరాటం తీవ్రంYS Sharmila: దొర దిగొచ్చిండు గానీ: 50 వేలు కాదు..లక్షా 90 వేలు: పోరాటం తీవ్రం

ఉన్నవ్ జిల్లాలోని మియాగంజ్‌లో బ్లాక్ పంచాయతీ ఎన్నికల కవరేజ్‌కు వెళ్లిన ఓ టీవీ జర్నలిస్ట్‌పై చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఐఎఎస్ దివ్యాన్షు పటేల్ స్వయంగా చేయి చేసుకున్నారు. అతణ్ని తరిమి తరిమి కొట్టారు. పారిపోతోన్నా వదల్లేదు. వెంటాడి మరీ చితగ్గొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నవ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ స్పందించారు.

 An IAS officer was caught on camera chasing down a TV reporter and beating him in UP

ఈ ఘటనపై తనకు జర్నలిస్టు సంఘాల నుంచి లిఖితపూరక ఫిర్యాదు అందిందని చెప్పారు. సమగ్ర విచారణ విచారణ జరిపిస్తానని తెలిపారు. ఐఎఎస్ అధికారి దివ్యాన్షు పటేల్ తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని అన్నారు. జర్నలిస్టు అసోసియేషన్లతో దివ్యాన్షు పటేల్ మాట్లాడారని, వారికి క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. లఖిమ్‌పూర్ ఖీరి ప్రాంతంలో మహిళా అభ్యర్థి అనితా యాదవ్ పట్ల కొందరు రాజకీయ పార్టీల నాయకులు దురుసుగా ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేయడానికి ప్రయత్పించారు. కాంగ్రెస్ పార్టీ సీని

కాగా- బ్లాక్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస పట్ల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణ్‌దీప్ సుర్జేవాలా, బాలీవుడ్ నటి స్వరా భాస్కర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లంబా, ట్వీట్టర్ ద్వారా స్పందించారు. ఉత్తర ప్రదేశ్ హింసాత్మక ప్రదేశ్‌గా మారిందంటూ మండిపడ్డారు. ఈ తరహా పరిస్థితుల నుంచి విముక్తిని కల్పించాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని సూచించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

English summary
An IAS officer was caught on camera chasing down a TV reporter in public and beating him viciously. Divyanshu Patel, the Chief Development Officer of Unnao, is accused of attacking reporter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X