వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ గురూ: కారు తీసిన తీరు అదిరింది, సోషల్ మీడియాలో పోస్ట్, వైరల్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

అక్కడ కారు పట్టే స్థలమే ఉంది. సిమెంట్ రోడ్డు మీద కాస్త ముందుకు వెనకకు వెళితే అంతే. అక్కడనుంచి కారును మాత్రం తీశాడు బిజు. కాస్త ముందుకు.. వెనక్కి తిప్పి మరీ కారును చూశాడు. ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఒక నిమిషం 29 సెకండ్ల నిడివి గల వీడియోలో.. అతను మాత్రం కారును చాకచక్యంగా తీశాడు.

 ఇరుకైన ప్రదేశంలో ఇన్నోవా..

ఇరుకైన ప్రదేశంలో ఇన్నోవా..

కేరళలోని వాయనాడుకి చెందిన పీజే బిజు డ్రైవ్ చేశాడు. ఇన్నోవా కారును ఇరుకైన ప్రాంతం నుంచి చక్కగా తీసుకొచ్చాడు. కంటి రెప్పపాటులో నిర్లక్ష్యం వహించిన అంతే సంగతులు. ముందు, వెనక కాలువలాంటిది ఉండటంతో అందులో కారు పడిపోవడం ఖాయం. కానీ ఎవరూ చేయని సాహసం చేసి.. ఔరా అనిపించారు.

ముందుకు వెనక్కి అని..

ముందుకు వెనక్కి అని..

కారును ముందుకు వెనక్కి తీసుకొన్నాడు. వెనక్కి తీసుకునే క్రమంలో కారు పడిపోతుందా అనే అనుమానం కలిగింది. కానీ బ్యాలెన్స్ చేసుకున్నాడు. అలా రెండు మూడు సార్లు చేశాడు లేదో.. కారు స్టీరింగ్ తిప్పితే చాలు రోడ్డుమీదకి వచ్చింది. అక్కడే ఉన్న జనం వావ్ అంటూ కేకలు పెట్టారు.

Recommended Video

Jaya Prakash Reddy : గొప్ప కళాకారుడిని కోల్పోయాం.. జయ ప్రకాష్ రెడ్డి మరణం పై రాజేంద్ర ప్రసాద్,అలీ!

వీడియో పోస్ట్.. వైరల్


వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. ఆదివారం రాత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. వేలాదిమంది షేర్ చేశారు. బిజు గత 15 ఏళ్లుగా డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. తన స్నేహితుడు కారును పెయింట్ వర్క్ చేద్దామని తీసుకొచ్చానని బిజు తెలిపారు. అయితే వర్క్ షాప్ వారు సిమెంట్ వద్ద అలా పెట్టేశారని పేర్కొన్నారు. ఆ కారుని తాను డ్రైవ్ చేశానని.. ఆ సమయంలో తన భార్య వీడియో తీశారని తెలిపారు. తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. స్పందన రావడంతో తనకు తెలిసిందని చెప్పారు.

English summary
incredible parking video from Kerala is viral: the video posted on Twitter has garnered a few thousand shares since Sunday night
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X