బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇంజనీరును ఢీకొన్న ఇండిగో బస్సు, సీరియస్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్లిన ఇండిగో బస్సు ఎయిర్ ఇండియా సిబ్బందిని ఢీకొనడంతో ఒకరికి తీవ్రగాయాలైనాయి. వెంటనే తీవ్రగాయాలైన ఇంజనీరును ఆసుపత్రికి తరలించామని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి శివకుమార్ తెలిపారు.

ఎయిర్ ఇండియా సర్వీస్ విభాగంలో పని చేస్తున్న ఇంజనీరు విమానం ఎఐ 265 ను పరిశీలించి కిందకుదిగిన సమయంలో అటువైపు ప్రయాణికులతో వెలుతున్న ఇండిగో బస్సు వెగంగా వెళ్లి ఆయన్ను ఢీకొనింది. అనంతరం బస్సు ఇంజనీరును కొంత దూరం లాక్కోని వెళ్లిన సమయంలో తీవ్రగాయాలైనాయని ఎయిర్ ఇండియా అధికారి శివకుమార్ తెలిపారు.

An IndiGo bus carrying passengers to an aircraft rammed into an Air India employee in Bengaluru

ఇండిగో బస్సు చాల పెద్దదని, ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుగుతోందని ఎయిర్ ఇండియా సిబ్బంది అంటున్నారు. ఇక ముందు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.

బస్సు డ్రైవర్ కావాలని ఇంజనీరును ఢీకొనలేదని అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎవ్వరూ సంచరించరని, ఆ ప్రాంతంలో సంచరించే బస్సులు వేగంగా నడుస్తుంటాయని, ఆకస్మికంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

English summary
An IndiGo bus carrying passengers to an aircraft rammed into an Air India employee, injuring him seriously, at the Bengaluru airport on Saturday evening, according to a senior official of the national carrier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X