వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"తలుపులు మూసుకుని ఏడ్చిన జయలలిత!.. అదే అత్యంత కఠిన సమయం"

సిమి గరేవాల్, కరణ్ థాపర్ వంటి జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. జయ చేసిన చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

చెన్నై: రాజకీయ జీవితంలో ఉన్నవారు.. పబ్లిక్ ఫిగర్స్‌గా చలామణి అవుతున్నవారు.. మీడియా ఫోకస్ ను కోరుకోవడం పరిపాటి. ప్రజలతో మమేకమవడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇంటర్వ్యూల ద్వారా జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ తమిళ దివంగత సీఎం జయలలిత తీరు ఇందుకు పూర్తిగా భిన్నం. ఆమె జీవితం ఆసాంతం అతికొద్దిమందికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చారు.

అందులో సిమి గరేవాల్, కరణ్ థాపర్ వంటి జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. జయ చేసిన చేసిన కొన్ని కామెంట్స్ అప్పట్లో ఆసక్తిని రేకెత్తించాయి.

Photos : జయలలిత కు నివాళి

సిమి గరేవాల్ తో ఇంటర్వ్యూ:

సిమిగరేవాల్ : ఏళ్లుగా మీ రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తున్నాను. సుదీర్ఘ ప్రయాణం. సినిమా కథల కంటే కూడా నాటకీయతతో కూడుకున్నది కదా!
జయ: అవును.. చాలా ఆందోళనకరమైన జీవితం..

రాజకీయ జీవితం మీలో కఠిన వైఖరిని తీసుకొచ్చిందా?
జయ: రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో చాలా భయం భయంగానే ఉండేదాన్ని. బిడియం ఎక్కువ. సమావేశాల్లో మాట్లాడాలంటే ఆ భయం ఇంకా ఎక్కువగా ఉండేది.

An interesting interview with jayalalitha, some contemplative questions

ఈ స్థానానికి చేరుకుంటానని ముందే ఊహించారా?
జయ: లేదు.. ముందు ఏం జరగబోతుందో తెలియకపోవడం కూడా మనకు కొన్నిసార్లు మేలు చేస్తుంది. ఇప్పుడున్న స్థానానికి చేరుకుంటానని ముందే తెలిస్తే.. భయం వేసేది.

మీరు ఎదుర్కొన్న అత్యంత కఠిన సమయం?
జయ: ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో నా ప్రాధాన్యాన్ని కాపాడుకుని ముందుకెళ్లిన సందర్బం అత్యంత సంక్లిష్టమైనది. అప్పుడు పార్టీలో కొనసాగాలనిపించలేదు.

ఎందుకు కొనసాగవద్దనుకున్నారు?

జయ: ఆ సమయంలో ఎన్నెన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. చుట్టూ ఉన్నవాళ్లు అవమానంతో చూశారు. నటుల్ని, డాక్టర్లని, లాయర్లను, ఇతర ఏ రంగంలో ఉన్నవారినైనా సరే ఎంతో గౌరవంతో ఇంటర్వ్యూ చేస్తారు. కానీ రాజకీయ నేతల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారి తీరు చాలా దారుణంగా ఉంటుంది. ఇబ్బందికర, అవమానకర ప్రశ్నలు అడుగుతారు. ఒక్కసారి కూడా మన జీవితంలో ఎదురుపడని వ్యక్తులు.. మన తప్పుల్ని ఎత్తి చూపిస్తారు. చాలా సున్నిత మనస్కురాలిని కావడంతో.. మీడియాలో వచ్చే కొన్ని వార్తలు నన్ను బాధపెట్టాయి.

మీరంటే ఎందుకు కొందరికి భయం?

జయ: నా పేరును చూసేనేమో!.. (చిన్నగా నవ్వుతూ..), ఇంతకుముందున్న జయలలిత వేరు. తను ఎప్పుడూ అందరితో కలిసేది కాదు. బెరుగ్గా ఉండేది. ఎవరైనా నిలదీస్తే తిరిగి సమాధానం చెప్పలేనంత భయం ఉండేది. అవమానాలు ఎదురైనప్పుడు ఇంటికెళ్లి తలుపులు మూసుకుని ఏడ్చేది. అప్పటి జయలలితకు ఇప్పటి జయలలితకు పోలిక లేదు. నేను మారిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది.

శశికళతో మీ సాన్నిహిత్యంపై చాలా విమర్శలున్నాయి. అయినా ఎందుకు కొనసాగించారు?
జయ: చాలామంది శశికళను తప్పుగా అర్థంచేసుకున్నారు. కేవలం నాపై తనకున్న విధేయత కారణంగానే చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా తాను వెనక్కి తగ్గలేదు. ఏడాది పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. ఎంతో బాధపడింది.

జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?

అవినీతి కేసులతో ఇబ్బందిపడ్డారా?
జయ: ఇబ్బందులేమి లేవు. నా మీద పెట్టిన కేసులన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినవే.

జైళ్లు.. అవమానాలు.. ఇదంతా ఎందుకని ఎప్పుడు అనిపించలేదా?

మార్చి25,1989న అప్పటి సీఎం కరుణానిధి సమక్షంలో నాపై దాడి జరిగింది. చెప్పులతో దాడి చేశారు. చీరపట్టి లాగాలని చూశారు. స్పీకర్ టేబుల్ మీద పెద్ద గాజు గంట ఉండేది. దాంతో నా తలమీద కొట్టాలని వారు ప్రయత్నించారు. అదే జరిగుంటే నేను బ్రతికుండేదాన్ని కాదు. అది నా జీవితంలో జరిగిన అత్యంత దారుణ సంఘటన. జైలుకు వెళ్లడం కూడా నా జీవితంలోనే అత్యంత బాధాకర ఘటన.

కరుణ్ థాపర్ ఇంటర్వ్యూ:

ఎమ్మెల్యేలు, మంత్రులు మీ ముందు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేస్తారు?
జయ: ఇది అందరు రాజకీయ నాయకులకు జరిగేదే. డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరుణానిధికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.

కానీ వారు మనుషులు కదా!

జయ: నా చుట్టూ జరిగిన చిన్న విషయమైనా అతిగానే కనిపిస్తుంది. పెద్దవారి ఆశీస్సులు తీసుకోవడం భారతీయ సాంప్రదాయం.

ముక్కసూటితనం మీకు వ్యతిరేకంగా పనిచేస్తోందా?

జయ: నేను నిజాయితీపరురాలిని. ఇప్పుడు మీతో కూడా నిజాయితీతో వ్యవహరించనివ్వండి. అలాగే ముక్కుసూటిగా నిజాలు మాట్లాడేందుకు ప్రాధాన్యతినిస్తాను.

మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు ప్రతీ రాజకీయ నాయకుడు ఖండిస్తాడు. పోటీపడుతూ ప్రకటనలు చేస్తారు. ఇతరులపై అలాంటి సంఘటనలు జరిగితే వాటిని ఖండించిన రాజకీయ నేత ఇప్పటివరకూ ఎవరు లేరు. బాధ్యులెవరు, బాధితులెవరు? అన్న విషయాలకు అతీతంగా ఇలాంటి ఉన్మాద చర్యలను అందరూ తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. మైనారిటీలపై జరిగే వాటినే నేరాలుగా చూడటం సరికాదు. ఇలాంటి సంఘటనలు మొత్తం మానవత్వంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. ఈ దేశ రాజ్యాంగం మైనారిటీలకు మాత్రమే కాదు. మెజారిటీ వర్గాల వారికీ హక్కులున్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి.
(మార్చి1,2002 గోద్రా మారణకాండ సమయంలో)

English summary
Its an interesting interview with Jayalalitha done by Karan thapar. Some of the interesting comments of jayalalitha, here we mentioning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X