భర్తకు బాయ్ బాయ్, ప్రియుడితో సహజీవనం, అపార్ట్ మెంట్ ఓనర్ తో ?, బూడిద మిగిలింది !
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఏదో వరుసకు భర్తతో కాపురం చేసింది. తరువాత భర్తకు గుడ్ బై చెప్పేసిన భార్య ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో కలిసి నివాసం ఉంటూ సహజీవనం చేస్తోంది. ప్రియుడు సరిపోలేదని అపార్ట్ మెంట్ ఓనర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో రొమాన్స్ చేసింది. ప్రియుడికి మండిపోయి ప్రియురాలిని కాల్చి బూడిద చేశాడు.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో మంజుల (32) అనే మహిళ నివాసం ఉంటున్నది. 13 ఏళ్ల క్రితం మంజులకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. ఏడాది పాటు ఏదో మాట వరుసకు భర్తతో కాపురం చేసిన మంజుల తరువాత అతనితో గొడవలుపడింది. 10 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయిన మంజుల తరువాత నారాయణ (42) అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది.
నారాయణతో అక్రమ సంబంధం పెట్టుకున్న మంజుల గత 10 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని సంపిగేనగర ఏరియాలో నివాసం ఉంటున్నది. పెళ్లి చేసుకోకుండానే నారాయణ, మంజుల సహజీవనం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ అపార్ట్ మెంట్ లో మంజుల పని చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంజుల అపార్టె మెంట్ లోనే ఉంటోంది.

కొత్తగా అపార్ట్ మెంట్ ఓనర్ ను సెట్ చేసుకున్న మంజుల తనను మోసం చేస్తోందని ఆమె ప్రియుడు నారాయణ రగిలిపోయాడు. మార్చి 29వ తేదీన మంజులను హెబ్బగుడి సమీపంలోని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లిన నారాయణ అక్కడ ఆమెతో గొడవపెట్టుకున్నాడు. మర్యాదగా అపార్ట్ మెంట్ లో పని నిలిపేయాలని నారాయణ అతని ప్రియురాలు మంజులను హెచ్చరించాడు,
నిన్ను వదిలేస్తా కాని నేను అపార్ట్ మెంట్ లో పని మాత్రం వదలను అని మంజుల తేల్చి చెప్పింది. అంతే నారాయణ కత్తితో అతని ప్రియురాలు మంజులను పొడిచి చంపేశాడు. మందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ముంజల శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటి కాల్చి బూడిద చేశాడు. సంఘటనా స్థలంలో మంజుల తల పుర్రె, ఎముకలు మాత్రం మిగిలాయని, నారాయణను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications