వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ పై ప్రయాణం ... 2200కిమీ సైకిల్ తొక్కుతూ ఒక వృద్ధురాలి సాహసం

|
Google Oneindia TeluguNews

ఎల్లలు లేని భక్తి భావానికి 68 ఏళ్ల మహిళ సాగిస్తున్న ప్రయాణమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 68 ఏళ్ల వృద్ధురాలు వైష్ణోదేవి ఆలయానికి అత్యంత సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. గతంలో కాశీకి, రామేశ్వరానికి వెళ్లడం కోసం రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కాలినడకన వెళ్లిన ఉదంతాలు విన్నాం. ప్రస్తుతం సైకిల్ పై వైష్ణోదేవి ఆలయానికి 68 ఏళ్ల మహిళ ఒంటరిగా రెండువేల రెండు వందల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించిన ఆసక్తికర కథనాన్ని తెలుసుకుంటున్నాం.

కంటే కూతుర్నే కనాలి .. తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200కి.మీ తొక్కిన బాలిక సాహసానికి సలాం అనాలికంటే కూతుర్నే కనాలి .. తండ్రిని సైకిల్ ఎక్కించుకుని 1200కి.మీ తొక్కిన బాలిక సాహసానికి సలాం అనాలి

 మహారాష్ట్ర నుండి సైకిల్ పై వైష్ణో దేవి ఆలయానికి బయలుదేరిన 68 ఏళ్ల వృద్ధురాలు

మహారాష్ట్ర నుండి సైకిల్ పై వైష్ణో దేవి ఆలయానికి బయలుదేరిన 68 ఏళ్ల వృద్ధురాలు

మహారాష్ట్రలోని బుల్దనా జిల్లా ఖామ్‌గావ్ కు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు రేఖ దేవ్బంకర్ వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. వైష్ణో దేవిని దర్శిస్తానని మొక్కుకున్న రేఖా దేవ్బంకర్ అనుకున్నదే తడవుగా సైకిల్ మీద తన ప్రయాణాన్ని ప్రారంభించింది. హిమాలయాల్లో కొలువైన వైష్ణోదేవిని దర్శించాలన్న ఆమె సంకల్పం ముందు ఆమె వయసు చిన్నబోయింది. ప్రతిరోజు 40 నుండి 50 కిలోమీటర్ల దాకా ప్రయాణం సాగిస్తోంది. సైకిల్ తొక్కుతూ ఆమె తన గమ్యాన్ని చేరుకోవటానికి ఉత్సాహంగా వెళ్తోంది .

సైకిల్ పై వృద్ధురాలి సాహసయాత్ర ... సోషల్ మీడియాలో వైరల్

సైకిల్ పై వృద్ధురాలి సాహసయాత్ర ... సోషల్ మీడియాలో వైరల్

అలసట వచ్చినప్పుడు స్థానికంగా ఉండే దేవాలయాలలో సేదతీరుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్ బోర్డర్ వరకు చేరుకుంది . ఆమె వెళుతున్న క్రమంలో ఆమె గురించి తెలుసుకున్న వారు ఆమె సైకిల్ తొక్కుతూ వైష్ణో దేవికి వెళ్లడానికి సాగిస్తున్న ప్రయాణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. 68 ఏళ్ల మహిళ ఒంటరిగా సైకిల్ పై రెండువేల రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది అని, వైష్ణో దేవిని దర్శించుకోవడం కోసం ఆమె ఈ సాహసోపేతమైన ప్రయాణాన్ని సాగిస్తోందని తెలుసుకున్న నెటిజన్లు అవాక్కయ్యారు.

 భక్తి ఎంతటి పనైనా చేయిస్తుందని పలువురి ప్రశంస

భక్తి ఎంతటి పనైనా చేయిస్తుందని పలువురి ప్రశంస

సోషల్ మీడియాలో పలువురు ఆమె సాహసాన్ని కొనియాడుతున్నారు. భక్తి ఎంతటి పనినైనా చేయిస్తుంది అని పలువురు ఆమె భక్తి భావానికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ శక్తి కి ఇదే నిదర్శనం అంటూ 68 ఏళ్ల మరాఠీ మహిళ ఒంటరిగా సైకిల్ ద్వారా వైష్ణోదేవి ఆలయానికి వెళుతోంది అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నమ్మశక్యం కావడం లేదంటూ, అయినప్పటికీ నమ్మక తప్పని ఆమె తన ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేస్తుందని విశ్వసిస్తున్నామని చెప్తున్నారు.

Recommended Video

#Coronavirusindia : భారత్ లో రికార్డు స్థాయి లో నమోదు అవుతున్న Corona కేసులు | #IndiaFightsCorona
2200 కిలోమీటర్లు వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ తొక్కుతూ వెళ్ళటం నిజంగా సాహసం

2200 కిలోమీటర్లు వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ తొక్కుతూ వెళ్ళటం నిజంగా సాహసం

ప్రస్తుతం 20 ఏళ్ళకే కాస్త దూరం కూడా నడవలేని వాళ్ళు ఉన్నారు. కాసేపు నిలబడలేనివారు, కాసేపు సైకిల్ తోక్కితేనే క్రింద పడిపోయే వారు ఉన్నారు . అలాంటి కాలంలో ఒక వృద్ధురాలు ఉత్సాహంగా సైకిల్ తొక్కటం,ఏకంగా ఒక సహసానికే బయలుదేరటం ఆసక్తికర అంశం . మొత్తానికి 2200 కిలోమీటర్లు వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకోవటం కోసం ఓ 68 ఏళ్ల మహిళ సైకిల్ తొక్కుతూ ప్రయాణాన్ని సాగించటం నిజంగా ఆశ్చర్యకరం.

English summary
Devotion can make us take up any challenge. A 68-year-old woman from Maharashtra's Buldhana district is travelling alone to Vaishno Devi on her bicycle covering a distance of 2200 kilometers. Her video is going viral on social media, in which she can be seen riding the bicycle alone on her way to Vaishno Devi. Soon after her video went viral, people started praising the dedication and courage of the elderly woman on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X