వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడితో అక్క, చెల్లెకు అన్నగా మారిన ఎస్ పి, మానవత్వాన్ని చాటుకొన్న ఎస్ పి

ప్రేమించిన యువకుడితో అక్క వెళ్ళాలని నిర్ణయించుకోవడంతో ఒంటరిగా ఉన్న చెల్లెకు అన్నగా ఉండేందుకు ఎస్ పి ముందుకు వచ్చాడు. చెల్లె భాద్యతను తాను తీసుకొంటానని ఆయన ప్రకటించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలు వారు. అయితే తన అక్క ప్రేమికుడితో వెళ్ళిపోయేందుకు సిద్దమైంది.అయితే ఉన్న ఒక్కగానొక్క తోడు కూడ దూరమౌతోందని చెల్లి బాధపడింది. తనను వీడిపోకూడదని అక్కను వేడుకొంది.అయితే చివరకు చెల్లెను ఓ ఎస్ పి సోదరుడిగా చూసుకొంటానని హమీ ఇచ్చాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులో ఈ ఘటన చోటుచేసుకొంది.ఇద్దరు అక్కాచెల్లెళ్ళు జీవనం సాగిస్తున్నారు.అయితే వీరి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో అక్కే సోదరిని పెంచి పెద్దచేసింది. విద్యాబ్యాసం కూడ ఆమె చేయిస్తోంది.

an orphan taken responsibility by sp

అక్క రేవతి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ ప్రేమను యువకుడి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే వీరిద్దరూ పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.

అయితే సోదరి పారిపోతే తన పరిస్థితి ఏమిటని చెల్లె రాధ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ వ్యవహరం చివరికి ఎస్ పి వద్దకు చేరింది.

ప్రేమించిన యువకుడితోనే తాను జీవనం సాగిస్తానని అక్క రేవతి చెప్పింది.అయితే చెల్లె తన పరిస్థితి ఏమిటని కుమలిపోయింది.

తన నుండి తన అక్క నుండి వేరు చేయకూడదని ఆమె ఎస్ పి ని కోరింది.అయితే ఈ విషయమై కొంత సేపు తటపటాయించిన ఎస్ పి మానవత్వాన్ని నిరూపించుకొనే నిర్ణయాన్ని తీసుకొన్నాడు.

చెల్లె రాధకు తాను అన్నయ్యగా ఉంటానని హమీ ఇచ్చాడు. ఆమె బాగోగులు తానే చూసుకొంటానని ప్రకటించాడు.ఎస్ పి అణ్ణామలై తీసుకొన్న నిర్ణయం పలువురి ప్రశంసలు పొందుతోంది.

English summary
an orphan taken responsibility by sp in karnataka state. sp annamalai taken responsibility of an orphan radha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X