వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్ ప్రో... టెంప్ట్ అయ్యారో అంతే సంగతి... సైబర్ నిపుణుల హెచ్చరిక...

|
Google Oneindia TeluguNews

యూజర్స్ డేటా భద్రత,గోపత్యపై అనుమానాలతో ఇటీవల భారత్ చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం భారత్‌కు చెందిన రొపోసో,చింగారీ తదితర యాప్స్‌‌కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. టిక్‌టాక్ వంటి యాప్స్‌పై నిషేధంతో వీటి యూజర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ప్రత్యామ్నాయం కోసం చాలామంది వీటి వైపు మళ్లారు. అదే సమయంలో టిక్‌టాక్ నిషేధాన్ని అదనుగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.

Recommended Video

TikTok Pro App టిక్‌టాక్ కొత్త వెర్షన్ నా ? Download చేసారో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి డేటా !

టిక్‌టాక్ ప్రో పేరుతో...

ఇటీవల కొంతమంది సైబర్ నేరగాళ్లు 'టిక్‌టాక్ ప్రో'(టిక్‌టాక్ కొత్త వెర్షన్) పేరుతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్‌లో ఓ మెసేజ్‌తో పాటు లింకును పంపిస్తున్నారు. 'టిక్‌టాక్ వీడియోలను వీక్షించండి... కొత్తవి క్రియేట్ చేయండి.. ఇప్పుడు టిక్‌టాక్ 'టిక్‌ టాక్ ప్రో' పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇక డౌన్‌లోడ్ చేసుకోండి' అని ఆ మెసేజ్‌లో పేర్కొంటున్నారు. టిక్‌టాక్‌పై నిషేధం నేపథ్యంలో టిక్‌టాక్ ప్రో వెర్షన్‌ని తీసుకొచ్చినట్లు పేర్కొంటున్నారు.

డౌన్‌లోడ్ చేస్తే... డేటా చోరీ...

ఆ లింకును క్లిక్ చేస్తే టిక్‌టాక్‌ లాంటి ఐకాన్ కనిపిస్తోంది. ఆ తర్వాత ఫోన్‌లోని కెమెరా,మైక్,ఇతరత్రా వాటికి యాక్సెస్ కోరుతుంది. యూజర్స్ వాటికి అనుమతులిస్తే... ఇక ఫోన్‌లోనే తిష్ట వేసుకుంటుంది. కానీ యూజర్స్ అనుకున్నట్లు ఆ యాప్ పనిచేయదు. ఇలాంటి యాప్స్‌తో ఫోన్‌లోని యూజర్స్ డేటా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. వారు ఉపయోగిస్తున్న ఇతర సోషల్ యాప్స్ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఆ 25 యాప్స్ తొలగింపు...

ఆ 25 యాప్స్ తొలగింపు...

గూగుల్ ప్లే స్టోర్‌లో ఇలాంటి 25 ప్రమాదకర యాప్స్ 2.34 మిలియన్ల డౌన్స్ పొందాయని... అవి ఆండ్రాయిడ్ యూజర్స్ ఫేస్‌బుక్ డేటాను చోరీ చేశాయని ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎవినా వెల్లడించిన కొద్దిరోజులకే ఈ టిక్‌టాక్ ప్రో వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం. ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించిన ఆ యాప్స్‌ను గూగుల్ తమ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. యూజర్స్ ఏపీకే ఫైల్స్‌ డౌన్ లోడ్స్‌కి దూరంగా ఉండటం మంచిదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary
The TikTok ban came in India at a time when many weren’t anticipating it. But when it did, it resulted in a massive uproar. While people who hated the app were glad of finally getting rid of the cringe-content that was spreading across social media, people who found it entertaining to make and watch those videos were thoroughly disappointed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X