వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ ఘటనకు ఏడాది: మారని స్థితి (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిరుడు డిసెంబర్ 16న అంటే ఇదే రోజున దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థి నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన జరిగింది. నిర్భయ అంటే భయం లేని, ధైర్యం గల అనే అర్థం వస్తుంది. సంఘటన జరిగిన తర్వాత బాధితురాలికి మీడియా ఆ పేరు పెట్టింది. శరీర అంతర్భాగాల్లో తీవ్ర గాయాలైన నిర్భయకు చికిత్స అందించిన వైద్యులు ఆమెను చూసి నిర్ఘాంతపోయారు.

కాగా ఢిల్లీలోని సఫ్దార్ జంగ్ ఆస్పత్రి వైద్యులు నిర్భయకు చికిత్స అందించారు. ఈ విధమైన లైంగిక వేధింపులను ఎప్పుడూ చూడలేదని, బాధితురాలు శరీర అంతర్భాగాల్లో తీవ్రంగా గాయపడిందని వైద్యులు చెప్పారు. అత్యాచారం చేయబడిన వారం రోజుల తర్వాత చికిత్స పొందిన నిర్భయ మాట్లాడే స్థితికి వచ్చింది. అయితే మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌లోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు, సోదరుల కోసం నిర్భయ ఎప్పుడూ వారి జ్ఞాపకాల్లో జీవించే ఉంటుంది.

డిసెంబర్ 16న సాయంత్రం 4గంటలకు ఇంటి నుంచి మళ్లీ వస్తానని వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని నిర్భయ తల్లి తెలిపింది. కాగా నిర్భయ ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఘటన పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు పెల్లుబికాయి. అయితే నిర్భయ ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా మహిళలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసులు వేలాదిగా నమోదు కావడం దురదృష్టకరం.

నిర్భయ కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఇండియా గేట్, రేసినా హిల్స్, జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున యువత ఆందోళనలను నిర్వహించింది. నిర్భయ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు తక్షణమే బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు.

కాగా నిర్భయ ఘటనలో నిందితులైన ఆరుగురిలో ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తూ మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగితా నలుగురు నిందితులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ థాకూర్, పవన్ గుప్తాలకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. కాగా నిర్భయ కేసులో మరో నిందితుడైన మైనర్‌కు జస్టిస్ జువెనైల్ బోర్డ్(జెజెబి) మూడేళ్ల జైలు శిక్షను విధించింది. నిర్భయ ఘటన జరిగిన తర్వాత మహిళల భద్రత కోరుతూ.. నిర్భయ ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీలతో నిరసన వ్యక్తం చేశారు.

నిర్భయ ఘటన జరిగిన డిసెంబర్ 16, 2012 ముందు కంటే ఇప్పుడే ప్రతీ రోజు మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అత్యంత అరుదైన నిర్భయ ఘటన పట్ల దేశమంతా ఒక్కటై మహిళల భద్రతపై పోరాటం కొనసాగించింది. అయినా దురాలోచనతో వెళుతున్న యువతలో మార్పు రాకపోవడం శోచనీయం.

కాగా నిర్భయ ఘటన పట్ల వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఆరోపణలకు దిగాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. డిసెంబర్ 16ను నిర్భయ జ్ఞాపకంగా మహిళలపై హింసకు వ్యతిరేకంగా ‘వార్షిక ప్రతిజ్ఞ రోజు'గా పరిగణించాలని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ డిమాండ్ చేశారు. మహిళల భద్రత కోసం ఎలాంటి మార్పు అవసరమనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. మహిళలపై నేరం జరగని రోజే.. ప్రతీ రోజు కావాల్సిన అవసరం ఉంది. పురుషాధిక్యత కలిగిన సమాజంలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రతీ యువతిలో ఓ నిర్భయ ఉంటోంది. మహిళలు తమ భద్రత కోసం భయం లేకుండా, ధైర్యం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

మైనర్ నిందితుడు

మైనర్ నిందితుడు

2012, డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి నిర్భయ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. నిర్భయ కేసులో నిందితుడైన మైనర్ బాలుడికి జస్టిస్ జువెనైల్ బోర్డ్ 3ఏళ్ళ జైలు శిక్ష విధించింది.

బోర్డు ఎదుట మైనర్ నిందితుడు

బోర్డు ఎదుట మైనర్ నిందితుడు

2012, డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి నిర్భయ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. నిర్భయ కేసులో నిందితుడైన మైనర్ బాలుడి(17)ని జస్టిస్ జువెనైల్ బోర్డ్ వద్దకు తీసుకువస్తున్న పోలీసులు.

మీడియా ప్రతినిధులు

మీడియా ప్రతినిధులు

2012, డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి నిర్భయ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో జువెనైల్ బోర్డు ఎదుట వర్షంలో మీడియా ప్రతినిధులు.

మైనర్ నిందితుడు

మైనర్ నిందితుడు

2012, డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి నిర్భయ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత మైనర్ నిందితున్ని తరలిస్తున్న దృశ్యం.

నిందితులకు కఠిన శిక్ష

నిందితులకు కఠిన శిక్ష

2012, డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి నిర్భయ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ.. ఆలిండియా మహిళా సంస్కృతి సంఘటన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ఎదుట ఆందోళన చేస్తున్న దృశ్యం.

నిర్భయకు నివాళి

నిర్భయకు నివాళి

2012, డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి నిర్భయ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. డిసెంబర్ 29న చికిత్స పొందుతూ మృతి చెందిన నిర్భయకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రజలు నివాళులర్పించారు.

మీడియాతో డిఫెన్స్ న్యాయవాది

మీడియాతో డిఫెన్స్ న్యాయవాది

2012, డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి నిర్భయ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. న్యూఢిల్లీ హైకోర్టు ఎదుట మీడియాతో మాట్లాడుతున్న డిఫెన్స్ న్యాయవాది ఏపి సింగ్.

నిర్భయ కేసులో నిందితులు

నిర్భయ కేసులో నిందితులు

2012, డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి నిర్భయ అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. నిర్భయ కేసులో నిందితులైన వినయ్ శర్మ, పవన్ గుప్తా(ముసుగు వ్యక్తి), అక్షయ్ థాకూర్, ముకేష్ సింగ్‌లను న్యూఢిల్లీ హైకోర్టులో ప్రవేశపెట్టారు.

English summary
A lot has been written and broadcasted in media since the 23-year old paramedical student Nirbhaya was brutally gangraped in a moving bus on the night of December 16 last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X