వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతిపితను ట్రంప్ డిసైడ్ చేస్తారా: నాడు కేసీఆర్..నేడు మోడీ , అక్కడే అసలు ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీలు భేటీ అయ్యారు. ఇలా ఇద్దరూ భేటీ కావడం ఇది రెండోసారి. అయితే ఇరు దేశాధినేతలు ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీని జాతిపిత గాంధీతో పోల్చారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

మోడీని జాతిపిత గాంధీతో పోల్చిన ట్రంప్

మోడీని జాతిపిత గాంధీతో పోల్చిన ట్రంప్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ మోడీని ఆకాశానికెత్తేశారు. మోడీ ప్రధానిగా కాకముందు భారత దేశం ఎలాగుండేదో తనకు తెలుసన్న అమెరికా అధ్యక్షుడు... మోడీ ప్రధాని అయ్యాక మరో భారతదేశం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రధాని కాకముందు భారత్‌లో ఏకత్వం అనేది లోపించిందని మోడీ ప్రధాని అయ్యాక ఒక తండ్రి పాత్ర పోషించి అన్నిటినీ కలిపారని ట్రంప్ చెప్పారు. అందుకే తనను భారత జాతిపితగా పిలుస్తానని ట్రంప్ చెప్పారు.

 భారత్‌కు జాతిపిత డిసైడ్ చేసేందుకు ట్రంప్ ఎవరు..?

భారత్‌కు జాతిపిత డిసైడ్ చేసేందుకు ట్రంప్ ఎవరు..?


ఇక ప్రధాని మోడీని జాతిపిత గాంధీతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటీషు వారిని భారత్‌నుంచి పారద్రోలేందుకు అహింసా మార్గమే ఆయుధంగా గాంధీ పోరాటం చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు జాతిపిత ఎవరో ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారని మండిపడుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రంప్ జాతిపిత వ్యాఖ్యలు ప్రజలు ఆమోదించరని స్వాతంత్ర్య పోరాటాన్ని దగ్గరుండి చూసినవారు చెబుతున్నారు.

తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ అని పొగిడిన కొందరు

తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ అని పొగిడిన కొందరు

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక నాడు తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ అని కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే ప్రజలు మాత్రం దీన్ని స్వీకరించలేదు. ఎందరో ప్రాణత్యాగాల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు చేశారని తెలంగాణ మేధావులు చెప్పారు. ఒక్క కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదన్న విషయాన్ని గమనించాలని నాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు చెప్పారు. అంటే తెలంగాణ సమాజం కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా ఒప్పుకునేందుకు ఇష్టపడలేదనేది స్పష్టం అవుతోంది.

గాంధీజీ గురించి ట్రంప్‌కు అవగాహన లేదు

గాంధీజీ గురించి ట్రంప్‌కు అవగాహన లేదు

ఇది ఇలా ఉంటే ట్రంప్ మోడీని జాతిపితతో పోల్చడాన్ని తప్పుబట్టారు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. దేశానికి ఒకే ఒకరు జాతిపితగా ఉంటారని గుర్తుచేశారు. గాంధీజీ గురించి, ఆయన పోరాటం గురించి ట్రంప్‌కు అవగాహన లేదని దుయ్యబట్టారు. ఏమి చూసి మోడీని జాతిపితగా ట్రంప్ గుర్తించారు.. అని ప్రశ్నించారు అసదుద్దీన్. ట్రంప్ మాట్లాడిన ఒక్క మాటతో తాను ఏకీభవిస్తానని చెప్పిన అసదుద్దీన్... ప్రధాని మోడీని రాక్‌స్టార్‌ ఎల్విస్‌తో పోల్చారని చెప్పారు. తన పాటలతో ప్రజలను ఎల్విస్ మెస్మరైజ్ చేస్తే... మోడీ కూడా తన మాటలతో ప్రజలను మాయ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ట్రంప్ ఇటు పాకిస్తాన్‌తో అటు భారత్‌తో డబుల్ గేమ్ ఆడుతున్నారని ఓవైసీ చెప్పారు. ఓవైపు ఇరాన్‌తో మాట్లాడాల్సిందిగా పాక్‌ను దువ్వుతూనే మరోవైపు ఇరాన్‌ నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదని భారత్‌తో చెబుతున్నారని మండిపడ్డారు ఓవైసీ.

 మోడీని జాతిపిత అన్న అమృతా ఫడ్నవీస్

మోడీని జాతిపిత అన్న అమృతా ఫడ్నవీస్

ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ మోడీకి శుభాకాంక్షలు చెబుతూ మోడీని జాతిపిత అని అందులో పేర్కొంది. ఆమె చేసిన ట్వీట్‌తో సొంత పార్టీ నేతలే విమర్శించారు. ఇక నెటిజెన్లు సోషల్ మీడియాలో అమృతా ఫడ్నవీస్‌ను మామూలుగా ఆడుకోలేదు. మోడీని జాతిపితతో ఎలా పోలుస్తావంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. మోడీ మీకు గొప్పేమో మాకు మాత్రం మహాత్మాగాంధీనే గొప్ప అంటూ నెటిజెన్లు ట్వీట్ చేశారు. మోడీని మహాత్మా గాంధీతో పోల్చడం సిగ్గుచేటని ఇంకొందరు ట్వీట్ చేశారు. అయితే మోడీని జాతిపితగా ప్రమోట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎన్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తానికి మోడీని జాతిపితగా ప్రమోట్ చేయడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీని తప్ప మరొకరిని జాతిపితగా ఊహించుకునేందుకు భారతీయులు సిద్ధంగా లేరనే విషయాన్ని పలువురు మేధావులు గుర్తుచేస్తున్నారు.

English summary
US President Trump calling Indian PM Modi father of the Nation has once again raked up the issue. Many leaders and people of the country had condemned Trump's statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X