వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా రాజకీయ పరిస్థితికి అద్దంపట్టేలా ఆనంద్ మహీంద్ర ట్వీట్: పేలుతున్న జోకులు

|
Google Oneindia TeluguNews

ముంబై: ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో ఆయన షేర్ చేసిన ఓ వీడియోను రీట్వీట్ చేస్తూ మహారాష్ట్ర రాజకీయాలతో పోలుస్తూ రీట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆ ట్వీట్‌కు ఫిదా అవుతున్నారు.

శరద్ పవార్‌కు రివర్స్ పంచ్!: 1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్శరద్ పవార్‌కు రివర్స్ పంచ్!: 1978ని రిపీట్ చేసిన అజిత్ పవార్

ఆనంద్ మహీంద్ర ట్వీట్..

‘ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగిన పరిణామాలకు ఇంతకంటే బాగా వివరించగలమా?' అని ఆనంద్ మహీంద్ర ఆ పోస్టుకు శీర్షిక ఇచ్చారు. ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్‌కు లైకులు, రీట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

గతంలో చేసిన ట్వీటే.. రీట్వీట్ చేస్తూ..

ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ వీడియోలో ఏముందంటే.. రెండు జట్ల మధ్య కబడ్డీ పోటీలు జరుగుతుంటాయి. అందులో ఓ జట్టు ఆటగాడు కూతకు వస్తాడు. డిఫెండింగ్ జట్టులో ఓ ఆటగాడ్ని తాకి ఔట్ చేస్తాడు. ఆ తర్వాత గీత దాటి వెళ్లిపోకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కవ్వించేందుకు అక్కడే నిలబడతాడు.

గట్టిగా లాగి పడేస్తాడు.. దీంతో..

గట్టిగా లాగి పడేస్తాడు.. దీంతో..

ఈ క్రమంలో డిఫెండింగ్ జట్టులో ఔటైన ఆటగాడు అతని వద్దకు వచ్చి అతడ్ని గట్టిగా పట్టుకుని గీత లోపలికి లాగిపడేస్తాడు. దీంతో మిగితా ఆటగాళ్లు కూడా వచ్చి అతడ్ని అక్కడ్నుంచి కదలకుండా చేస్తారు. దీంతో అతడు ఔట్ అవుతాడు. దీంతో ఆ జట్టుకు మరో పాయింట్ వస్తుంది.

మహారాష్ట్ర పరిస్థితి అంతే..

మహారాష్ట్ర పరిస్థితి అంతే..

మొదట చూసేవాళ్లందరూ పాయింట్ రైడర్ టీంకే అనుకుంటారు. కానీ, చివరకు డిఫెండింగ్ ఆటగాడు సమర్థవంతంగా అతడ్ని ఒడిసిపట్టడంతో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మహారాష్ట్రలో కూడా దాదాపు ఇదే జరగడం గమనార్హం. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ గడువు ఇచ్చినప్పటికీ వారు వినియోగించుకోకపోవడం గమనార్హం.

పేలుతున్న జోకులు..

ఈ నేపథ్యంలోనే బీజేపీ.. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో శనివారం ఉదయం మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ మహా రాజకీయాలకు సరిగ్గా సరిపోతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ రైడర్ శివసేన నేత సంజయ్ రౌత్ అంటూ మరికొందరు పేర్కొన్నారు. ఇంకొందరు ఇలాంటి వీడియోలనే పోస్టు చేస్తున్నారు.

English summary
Industrialist Anand Mahindra on Saturday shared a Kabaddi video showing a "raider'' falling prey to an audacious move executed by a "defender'' to illustrate the ongoing political drama in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X