India
 • search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశవ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనల మధ్య అగ్నివీరులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై చెలరేగుతున్న ఆందోళనల మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అగ్ని వీరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అగ్ని వీరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న ఆయన వారి ఉద్యోగాలకు భరోసా ఇచ్చారు.

  Agneepath Scheme: Agniveers కు ఒకవేళ అలా జరిగితే రూ. కోటి పరిహారం *Defense || Telugu Oneindia
  అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు .. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర హామీ

  అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు .. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర హామీ


  మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నాలుగు సంవత్సరాల పాటు సాయుధ దళాల రెగ్యులర్ కేడర్‌లో రిక్రూట్ అయ్యే రక్షణ దళాలైన అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం, అగ్నిపథ్ అని పిలువబడే భారత రక్షణ దళాలలో కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీని కింద రిక్రూట్ అయినవారు నాలుగు సంవత్సరాల పాటు ఆర్మీ/నేవీ/వైమానిక దళంలో సేవలు అందించనున్నారు. అయితే నాలుగు సంవత్సరాల పాటు మాత్రమే వారికి త్రివిధ దళాలలో అవకాశం కల్పించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నుముట్టాయి. దీంతో దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని, కెరీర్‌లో అనిశ్చితి ఏర్పడుతుందని ఈ అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తున్న యువకులు అంటున్నారు.

  అగ్నిపథ్ విషయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం: ఆనంద్ మహీంద్రా

  అయితే, కేంద్రం మరియు త్రివిధ రక్షణ దళాల అధిపతి చెబుతున్న దానికి అనుగుణంగానే అగ్నిపథ్ పథకానికి సంబంధించి ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా "గత సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు తాను అగ్ని వీరులు పొందే క్రమశిక్షణ మరియు నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలా చేస్తాయి అని చెప్పానని పేర్కొన్నారు. అగ్నిపథ్ పై హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనకు బాధ కలిగించిందని అన్నారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా"మహీంద్రా గ్రూప్ అగ్నిపథ్ ద్వారా శిక్షణ పొందిన మరియు సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని స్వాగతిస్తుంది" అని స్పష్టం చేశారు.

  ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై నెటిజన్ల ప్రశ్నలు .. సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా


  మహీంద్రా గ్రూప్ అగ్ని వీరులకు ఏమి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆనంద్ మహీంద్రా ను ట్విట్టర్ వేదికగా వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, "కార్పొరేట్ సెక్టార్‌లో అగ్ని వీరుల ఉపాధికి పెద్ద అవకాశం ఉందన్నారు. నాయకత్వం, టీం వర్క్, శారీరక శిక్షణతో ఉండే అగ్ని వీరులకు కంపెనీ యొక్క కార్యకలాపాల నుండి పరిపాలన & మార్కెటింగ్ చైన్ నిర్వహణ వరకు అన్ని విభాగాలలో అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

   అగ్ని వీరులను శాంతింపజేయటానికి ప్రత్యేక రాయితీలు ప్రకటించిన కేంద్రం

  అగ్ని వీరులను శాంతింపజేయటానికి ప్రత్యేక రాయితీలు ప్రకటించిన కేంద్రం

  ఇదిలా ఉంటే ఆందోళనకారులను శాంతింపజేసేందుకు కేంద్రం కూడా అగ్నివీరులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖలోని 10% ఉద్యోగ ఖాళీలను అగ్ని వీరులకు అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రిజర్వ్ చేసే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ మరియు అస్సాం రైఫిల్స్ రిక్రూట్‌మెంట్‌లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు కర్ణాటక వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించాయి.

  అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పై వివాదం .. నేడు భారత్ బంద్

  అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పై వివాదం .. నేడు భారత్ బంద్


  'అగ్నిపథ్' పథకం యువతకు రక్షణ వ్యవస్థలో చేరి దేశానికి సేవ చేసే సువర్ణావకాశాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం ప్రకటించగా, రిక్రూట్‌మెంట్ విధానం వివాదాస్పదమని, బహుళ నష్టాలను కలిగిస్తోందని, దీర్ఘకాలిక సాంప్రదాయాన్ని తుంగలో తొక్కిందని, దీంతో నిరుద్యోగం మరింత పెరుగుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్మీలో ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువత నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతుంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది.

  English summary
  Mahindra Group chairman Anand Mahindra has given a bumper offer to agniveers amidst agitating concerns across the country and has made it clear that he will provide job opportunities to agniveers in Mahindra Group. Interesting tweet to this extent.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X