చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొలెరో ట్రక్‌తో మహిళ ఫుడ్ బిజినెస్, ఇంప్రెస్ అయిన ఆనంద్ మహీంద్రా, సాయం చేస్తానంటూ ట్వీట్!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఓ మహిళ మహీంద్రా బొలెరో ట్రక్‌తో మొబైల్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న విషయాన్ని ఓ పత్రికా కథనం ద్వారా తెలుసుకున్న మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

మంగళూరులోని హసన్ ప్రాంతానికి చెందిన శిల్ప(34) పదో తరగతి చదువు మధ్యలోనే ఆపేసింది. 2008లో ఆమె భర్త కనిపించకుండా పోయాడు. దీంతో అప్పట్నించి ఆమె జీవనోపాధి కోసం ధైర్యంగా మొబైల్ ఫుడ్ బిజినెస్ చేస్తోంది.

Anand Mahindra offers help to Mangalore woman entrepreneur

ప్రస్తుతం వ్యాపారం బాగా నడుస్తుండడంతో తన సోదరుడికి సాయంగా రెండో అవుట్ లెట్ ప్రారంభించాలని యోచిస్తోంది. విజయవంతంగా ఆమె వ్యాపారం సాగిస్తున్న తీరుకు సంబంధించి ఇటీవల ఓ ఆర్టికల్‌ ప్రచురితమైంది. దాన్ని ఆనంద్‌ మహీంద్రా చూశారు. వెంటనే స్పందించిన ఆయన శిల్ప ధైర్యాన్ని ప్రశంసించడమే కాక ఆమెకు సాయం చేస్తానని తెలిపారు.

'ఆమె చేస్తున్న వ్యాపారంలో మహీంద్రా బొలెరో చిన్న పాత్ర పోషిస్తోంది. నేను ఆమెకు సాయం చేయాలనుకుంటున్నాను. ఆమె రెండో అవుట్‌లెట్‌ ప్రారంభించేందుకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ విషయాన్ని ఎవరైనా ఆమెకు తెలియజేయండి..' అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్ 'శిల్పకు ఆర్థికంగా సాయం చేయవచ్చు కదా?' అని ట్వీట్ చేయగా.. 'తను నా దగ్గర నుంచి డబ్బు తీసుకుంటుందని నేను భావించడం లేదు.. ఆమె ఓ సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త.. ఆమె తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా..' అని సమాధానమిచ్చారు.

English summary
Noted industrialist and Chairman of diversified business conglomerate Mahindra Group, Anand Mahindra today said he was interested to invest in the mobile truck food business run by a woman entrepreneur in Mangaluru. Responding to a news report about how 34-year-old Shilpa was running a successful food truck on a Mahindra Bolero pick-up truck in Mangaluru, Mahindra said, he will personally invest for her expansion plans.According to the report, Shilpa is planning to start her second outlet to help her brother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X