వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేరని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని 7 రేస్ కోర్సు రోడ్డులో ఉన్న ప్రధాని మోడీ అధికార నివాసంలో మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైన సంగతి తెలిసిందే.

ఈ భేటీల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ సమర్పించిన రాజీనామా లేఖ ప్రధాని మోడీకి అందిందని, ఆనందీబెన్‌ రాజీనామాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించిందని ఆయన వ్యాఖ్యానించారు.

'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'

'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'


ఆనందీ బెన్‌ మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేస్తారని ఆయన తెలిపారు. ఆనందీ బెన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని తెలిపారు. యువ నాయకత్వం వృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆమె రాజీనామా చేశారని వెంకయ్య చెప్పారు. 18 సంవత్సరాల పాటు ఆమె గుజరాత్ కు సేవలు చేశారని కొనియాడారు.

 'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'

'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'


మరోవైపు గుజరాత్‌ కొత్త ముఖ్యమంత్రి అంశంపై ఈ సమావేశంలో చర్చించామని వెల్లడించిన వెంకయ్య గుజరాత్‌కు పరిశీలకులను పంపుతామని, ఆపై వారు ఎమ్మెల్యేలతో చర్చించి నివేదిక ఇచ్చిన తరువాత, తదుపరి సీఎం ఎవరన్న విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.

'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'

'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'


ఇదే క్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో అమిత్‌షా ఉన్నట్లు వస్తున్న వార్తలను వెంకయ్య తోసిపుచ్చారు. రేసులో అమిత్ షా లేరని ఆయన స్పష్టం చేశారు. కాగా, గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా విజయ్ రూపానీ వైపే బీజేపీ అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'

'ఆనందీ రాజీమానా ఆమోదం, రేసులో అమిత్ షా లేరు'

ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు.

English summary
The Bharatiya Janata Party (BJP) on Wednesday appointed Union minister Nitin Gadkari and general secretary Saroj Pandey as observers and asked them to consult legislative members of the party in Gujarat to decide on the name of the new chief minister of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X