వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడి కోసం పోలీసులకు చుక్కలు చూపించిన ‘ఆంధ్ర బాలిక’

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రియుడితో కలిసి జీవించాలని ప్లాన్ వేసిన బాలిక (16) తప్పుడు ఫిర్యాదు చేసిందని బెంగళూరు పోలీసు అధికారులు నిర్దారించారు. కేసు దర్యాప్తును ఆంధ్రపదేశ్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ సందర్బంలో న్యాయస్థానంలో బీ రిపోర్టు సమర్పించారు. గత సంవత్సరం (16) సంవత్సరాల బాలిక తన మీద ఇద్దరు యువకులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో నీవు ఎందుకు కేకలు వెయ్యలేదని పోలీసులు బాలికను ప్రశ్నించారు.

అత్యాచారం చేసిన సమయంలో ఒకరు సెల్ ఫోన్ లో చిత్రీకరించి రూ. 50 వేలు ఇవ్వకుంటే వీడియో మొత్తం ఇంటర్నెట్ లో పెడుతామని, నీ పరువు పోతుందని బ్లాక్ మెయిల్ చేశారని తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులకు చుక్కలు చూపించింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు, చివరికి బాలిక మీద అత్యాచారం జరగలేదని తెలుసుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Andhra girl craetes trouble to bengaluru police

ఇదీ జరిగింది..........1

ఆంధ్రప్రదేశ్‌లోని కోత్తపల్లికి చెందిన దంపతులకు (16) సంవత్సరాల కుమార్తె ఉంది. దంపతులు ఇద్దరు కూలి పని చేస్తున్నారు. బాలిక స్థానిక స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నది. బాలిక స్థానికంగా నివాసం ఉంటున్న యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను మందలించారు. యువకుడికి హితబోధ చేశారు. అయితే ఇద్దరు లెక్క చెయ్యకుండ తిరడగడం మొదలు పెట్టారు. పరిస్థతి విషమించడంతో బాలిక కుటుంబ సభ్యులు 2014లో బాలికను బెంగళూరు పిలుచుకుని వచ్చి హెణ్ణూరులోని భైరవేశ్వర లేఔట్ లోని ‘‘సిస్టర్ ఆఫ్ హోలి నేటివిటి క్రిస్టియన్ సెమినరిలో చేర్పించారు. సెమినరిలోని మొదటి అంతస్తులో నలుగురు సన్యాసినిలతో కలిసి బాలిక నివాసం ఉండేది.

2014 జులై 16వ తేదిన బాలిక తనంతట తానే బట్టలు తీసి వేసి బయటకు వచ్చి అర్థనగ్నంగా పడుకుని మతిస్థిమితం లేని విధంగా పడిపోయినట్లు నటించింది. కొంత సేపటికి సాటి సన్యాసులు విషయం గుర్తించి హెణ్ణూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి వైద్యపరిక్షలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి కాలింగ్ బెల్ వేశారని, తలుపు తీసిన తరువాత తన ముఖం మీద పెప్పర్ స్రే చల్లి అత్యచారం చేశారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలిక మీద అత్యాచారం జరగలేదని నిర్దారించిన వైద్యులు పోలీసులకు నివేదిక సమర్పించారు. పోలీసులు తలలు పట్టుకున్నారు. తరువాత బాలికకు ఫోరెన్సిక్ నిపుణులతో వైద్య పరిక్షలు చేయించారు. ఫోరెన్సిక్ నిపుణులు బాలిక మీద అత్యాచారం జరగలేదని నివేదిక సమర్పించారు. బాలిక మీద అత్యాచారం జరగలేదని రుజువు కావడంతో పోలీసులు బెంగళూరులోని ఎసీఎంఎం న్యాయస్థానంలో ఇటివల బీ రిపోర్టు సమర్పించారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చిన తరువాత కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించాలని పోలీసులు వేచి ఉన్నారు.

కుటుంబ సభ్యుల ఒత్తిడి చెయ్యడంతో బాలిక సన్యాసిగా మారడానికి అంగీకరించిదని, తరువాత ప్రియుడికి దూరంగా ఉండలేక తన మీద అత్యాచారం జరిగిందని తప్పడు ఫిర్యాదు చేసిందని బెంగళూరు నగర తూర్పు విభాగం డీసీపీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు.

English summary
An Andhra girl created trouble to Benagaluru police live with her fiancee and made false complaint of rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X