• search
  • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆంధ్రప్రదేశ్: కుప్పంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110 - ప్రెస్‌రిపోర్ట్

By BBC News తెలుగు
|
పెట్రోలు

లీటరు పెట్రోలు ధర చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.110కి చేరిందని 'ఈనాడు’ కథనం తెలిపింది.

''ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువగా ఉంది.

లీటరు పెట్రోలు ధర విశాఖపట్నంలో 106.80, విజయవాడలో రూ.107.63 ఉంటే కుప్పంలో మాత్రం రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు.

విశాఖపట్నంతో పోలిస్తే కుప్పంలో డీజిల్‌ మూడు రూపాయలు ఎక్కువగా ఉంది.

శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటరు పెట్రోలు రూ.108.92, డీజిల్‌ రూ.100.39 చొప్పున ఉంది.

అక్కడికి.. విశాఖకు పెట్రోలుపై లీటరుకు రూ.2.12 తేడా ఉంది. నిల్వ కేంద్రాల నుంచి దూరానికి అనుగుణంగా అయ్యే రవాణాఛార్జీలే ఈ తేడాకు కారణమని ఇంధన సంస్థలు చెబుతున్నాయి.

నెల్లూరు జిల్లా తడ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు దూరాన్ని లెక్కిస్తున్నారు.

ఒక్క పెట్రోలుపైనే కాదు.. డీజిల్‌, వంటగ్యాస్‌కూ ఇలాగే వడ్డనలు ఉంటున్నాయి. పన్నుల రూపంలో ప్రభుత్వాల బాదుడుకు తోడు రవాణా రూపంలో పడే భారానికీ వినియోగదారులే బాధితులవుతున్నార’ని ఆ కథనంలో రాశారు.

కరెన్సీ

ఆపరేషన్ కోసం అప్పు చేసి తెచ్చిన డబ్బును ఎలుకలు కొరికేశాయి

ఆపరేషన్‌ నిమిత్తం ఓ నిరుపేద రూ.రెండు లక్షలు అప్పు చేసి ఆ డబ్బు తన పూరి గుడిసెలో దాచుకోగా ఎలుకలు ముక్కలు ముక్కలుగా కొరికేశాయని 'సాక్షి’ కథనం తెలిపింది.

''ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో శనివారం వెలుగుచూసింది.

మహబూబాబాద్‌ మండలం ఇందిరానగర్‌ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నాడు.

తన కడుపులో ఏర్పడిన కణితిని ఆపరేషన్‌ చేసి తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో తెలిసినవారి వద్ద అప్పు చేశాడు.

వాటితోపాటు కూరగాయలు అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి ఇంట్లోని చెక్క బీరువాలో దాచాడు.

రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డబ్బును పరిశీలించేందుకు బీరువా తెరిచి చూడగా రూ.2 లక్షలకు సంబంధించిన నోట్లను ఎలుకలు పనికిరాకుండా కొరికేశాయి.

ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడ’ని ఆ కథనంలో రాశారు.

మద్యం

తాగి నడిపితే రూ.10 వేల జరిమానా

మొదటిసారి డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుడితే మోటర్‌ వెహికిల్‌ యాక్ట్‌ సెక్షన్‌ 185 కింద రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారని 'నమస్తే తెలంగాణ’ కథనం తెలిపింది.

''డ్రంకన్‌ డ్రైవ్‌ లో పట్టుబడ్డ 106 మందికి స్థానిక కోర్టులు శుక్రవా రం 106 మందికి జైలు శిక్షను విధించాయి.

ఇందులో ఒక రోజు నుంచి 17 రోజుల వరకు మందుబాబులకు జైలు శిక్షలు పడ్డాయి.

ఇలా మందుబాబు లు తరచు మద్యం సేవించి వాహనాలను నడిపి దొరికితే వారికి రూ.15 వేల జరిమానాతో పాటు రెండేండ్లు జైలు శిక్ష పడుతుందని సైబరాబాద్‌ ట్రాఫి క్‌ అధికారులు స్పష్టం చేశారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కూడా మూడు నెలల నుంచి శాశ్వతంగా రద్దయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

మద్యం సేవించి వాహనం నడిపి మరణానికి కారకులై న వారిపై కచ్ఛితంగా 304 పార్ట్‌-2 కింద కేసులను నమోదు చేస్తున్నామన్నారు.

ఈ సెక్షన్‌ కింద అభి యోగం రుజువైతే పదేండ్ల జైలు ఖాయమన్నారు’’ అని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Andhra Pradesh: A liter of petrol costs Rs. 110 in Kuppam - Press Report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X