వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Andhra Pradesh:ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి అగ్రస్థానం.. తెలంగాణ ర్యాంకు ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఆంధ్రప్రదేశ్‌‌కు ఈ వార్త ఊరటే అవుతుంది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ 2019 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రెండో ర్యాంకు ఉత్తర్ ప్రదేశ్‌కు దక్కగా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఉత్తర భారతం నుంచి ఉత్తర్ ప్రదేశ్, దక్షిణ భారతం నుంచి ఆంధ్రప్రదేశ్, తూర్పు భారతం నుంచి పశ్చిమ బెంగాల్, పశ్చిమ భారతం నుంచి మధ్యప్రదేశ్, ఈశాన్య భారతం నుంచి అస్సాంలు జాబితాలో స్థానం పొందాయి. ఇక కేంద్రం పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది.

రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ర్యాంకింగ్స్‌ను న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలు విడుదల చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా ఇవ్వడం జరిగిందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా , కార్మిక చట్టాల్లో సంస్కరణలు, వివాదాల చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా వ్యాపార నియంత్రణను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

Andhra Pradesh bags top rank in Ease of doing business, while Telangana stands at third position

Recommended Video

Himachal Pradesh సరిహద్దు లో భారీగా భారత సైన్యం... Tibetans Cheers Indian Army || Oneindia Telugu

కరోనావైరస్‌తో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయని చెప్పిన పీయూష్ గోయల్... భారత్ తిరిగి కోలుకునేందుకు ఎంతో సమయం పట్టదని అన్నారు. ఇందుకు కారణం ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌ అని వెల్లడించారు. ఇక ప్రపంచ దేశాల్లో వాణిజ్య పరంగా భారత్ కీలక పాత్ర పోషించనుందని జోస్యం చెప్పారు. ఇక భారత ప్రభుత్వం అత్యంత వేగవంతమైన సంస్కరణలు తీసుకురావడంతోనే 2014 వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ 142 ఉండగా 2019లో అది 63వ ర్యాంకుకు చేరుకుందన్న విషయాన్ని పీయూష్ గోయల్ గుర్తు చేశారు. ఒక దేశం టాప్ ర్యాంక్ పొందిందంటే అది కేవలం కేంద్రం ఘనత కాదని అది అన్ని రాష్ట్రాల కృషివల్లే వచ్చిందన్న సంగతి మరవకూడదని చెప్పారు.

English summary
Andhra Pradesh bagged the top rank in the ease of doing business while Telangana stood at 3rd position declared by centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X