వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో వైకాపా మాజీ ఎమ్మెల్యే: బైక్ లో వెళ్లి, వీడియో, అత్త ఆవేదన !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బళ్లారిలోని సిరుగుప్ప రోడ్డులోని అహంబావి ప్రాంతంలో ఉన్న ఇంటిలో బెంగళూరు సీసీబీ పోలీసులు ఇంకా సోదాలు చేస్తూనే ఉన్నారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి బైక్ లో చేరుకుని వివరాలు సేకరించారు.

శ్రీరాములు హామి

శ్రీరాములు హామి

గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో సోదాలు చేస్తున్నారని తెలుసుకున్న వెంటనే ఆయన ప్రాణస్నేహితుడు, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా విచారణకు సహకరిస్తామని సీసీబీ పోలీసులకు శ్రీరాములు హామీ ఇచ్చారని తెలిసింది.

బంగారం ఎంత ఉంది ?

బంగారం ఎంత ఉంది ?

గాలి జనార్దన్ రెడ్డి మామ మహేశ్వరరెడ్డిని సీసీబీ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో బంగారం ఎంత ఉంది ? బంగారం ఎప్పుడు ఎక్కడ కొనుగోలు చేశారు అని బెంగళూరు సీసీబీ పోలీసులు ఆరా తీశారని సమాచారం.

 బైక్ లో వైకాపా మాజీ ఎమ్మెల్యే

బైక్ లో వైకాపా మాజీ ఎమ్మెల్యే

గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో బెంగళూరు సీసీబీ పోలీసులు సోదాలు చేస్తున్నారని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి బళ్లారి చేరుకున్నారు. బళ్లారిలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కాపు రామచంద్రా రెడ్డి బైక్ లో వెళ్లారు.

గేటు ముందు సెక్యూరిటీ !

గేటు ముందు సెక్యూరిటీ !

గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గేట్ ముందు కొంతసేపు వేచి చూసిన తరువాత కాపు రామచంద్రా రెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు విషయంపై మీడియాతో మాట్లాడటానికి వైకాపా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి నిరాకరించారని కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేసింది.

గాలి అత్త ఆవేదన

గాలి అత్త ఆవేదన

గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలను సీసీబీ పోలీసులు మొబైల్ లో వీడియో తీశారని సమాచారం. ఆ సందర్బంలో గాలి జనార్దన్ రెడ్డి అత్త నాగలక్ష్మమ్మ సీసీబీ పోలీసుల తీరుపై మండిపడ్డారని తెలిసింది. పండుగలు, శుభకార్యాలయు, వివాహాలు జరిగే సమయంలోనే మాఇంటి మీద ఇలాంటి సోదాలు జరిపి ప్రతీకారం తీర్చుకుంటారని గాలి జనార్దన్ రెడ్డి అత్త నాగలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. సీసీబీ తీరుపై గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు.

English summary
Andhra Pradesh Rayadurgam YSRCP former MLA Kapu Ramachandra Reddy visited the Gali Janardhan Reddy home in Bellary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X