వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగేళ్ల చిన్నారిపై రేప్.. డాక్టర్లను చితకబాదిన బంధువులు (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కోల్‌కతాలో రోగి బంధువులు దాడి చేయడంతో డాక్టర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. బెంగాల్ సీఎం మమతబెనర్జీ జోక్యంతో సమస్య పరిష్కారమైంది. ఇది జరిగి 24 గంటలు గడవకముందే ఢిల్లీలో మళ్లీ ఇలాంటి ఘటనే జరిగింది. అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి ట్రీట్‌మెంట్ ఇవ్వలేదన్న కారణంతో పాప బంధువులు రచ్చ చేశారు. డాక్టర్లపై దాడి చేయడంతో పాటు హాస్పిటల్‌ ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

చొక్కాలు చించుతూ....కుర్చీలు విసురుతూ... బీఎస్సీ కార్యకర్తల వీరంగం...వీడియోచొక్కాలు చించుతూ....కుర్చీలు విసురుతూ... బీఎస్సీ కార్యకర్తల వీరంగం...వీడియో

నాలుగేళ్ల చిన్నారిపై రేప్

మంగళవారం సాయంత్రం ఢిల్లీ భావన ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ పాపను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. చిన్నారి ఏడుపు, కేకలు విని పొరిగింటి వ్యక్తి అక్కడికి వెళ్లి జరుగుతున్న దుర్మార్గాన్ని చూసి నిందితున్ని పట్టుకున్నాడు. స్థానికుల అతన్ని చితకబాది తీవ్ర రక్తస్రావమైన బాలికను తల్లిదండ్రులు రోహిణిలోని మహర్షి వాల్మికి హాస్పిటల్‌కు తరలించారు. అయితే చిన్నారికి మత్తు మందిచ్చి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో అక్కడి వైద్యులు తమ వద్ద ఆ సదుపాయాలు లేవని చెప్పారు. పాపను బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.

డాక్టర్లపై దాడి, ఫర్నీచర్ ధ్వంసం

డాక్టర్లపై దాడి, ఫర్నీచర్ ధ్వంసం

మెడికల్ టెస్టులు చేసే సౌకర్యం లేనందున మరో హాస్పిటల్ డాక్టర్లు చెప్పడంతో పాప బంధువులు ఆగ్రహించారు. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్లమనడంతో డాక్టర్లపై దాడి చేశారు. ఆస్పత్రిలోకి చొరబడి ఫర్నీచర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. ఆందోళనకారులు హింసకు పాల్పడటంతో డాక్టర్లు ఇతర సిబ్బంది అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

డాక్టర్ల ఆందోళన

డాక్టర్ల ఆందోళన

అత్యాచారానికి గురైన చిన్నారి బంధువుల దాడి నేపథ్యంలో మహర్షి వాల్మీకి డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాపపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్కోతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

English summary
A day after Bengal doctors called off their strike, a violent mob created ruckus inside a Delhi hospital over alleged rape of a minor girl. an angry crowd attacked doctors at Maharishi Valmiki Hospital and ransacked the ward where the girl was admitted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X