వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను కాపాడిన గజ ఈతగాళ్లను తిట్టిపోసిన భర్త

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: శబరిమతి నదిలో మునిగిపోతున్న తన భార్యను రక్షించిన వారి పైన ఓ భర్త తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంఘటన అహ్మదాబాదులో చోటు చేసుకుంది. ఆమెను అహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్విసెస్ సిబ్బంది కాపాడింది. వారిపై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సబర్మతీ నదీ తీరంలో నియమించబడిన ఫైర్ అండ్ ఎమర్జెన్సీ విభాగం గజ ఈతగాళ్లకు ఇటీవల ఈ వింత అనుభవం ఎదురైంది. ఓ మహిళ నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను కాపాడిన సిబ్బంది.. ఆమె భర్త నుంచి తిట్లు తిన్నారు.

Angry Husband Yells At Baffled Firemen For Saving His Drowning Wife In Ahmedabad

అహ్మదాబాద్‌లోని వల్లభ్ సదన్ వెనుకవైపున్న సబర్మతీ నదిలో మిథఖాలి ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల మహిళ నీటిలోకి దూకింది. దీనిని చూసిన భరత్ మంగేలా అనే గజ ఈతగాడు ఆమెను కాపాడేందుకు నదిలోకి దూకాడు. తన భార్య ఆత్మహత్యాయత్నాన్ని అతను ఆపడం చూసిన భర్త అక్కడకు వచ్చాడు. అతనితో తగవు పెట్టుకున్నాడు.

ఆమెను కాపాడిన భరత్ సింగ్ మాట్లాడారు. అమె భర్త వచ్చి మమల్ని ప్రశ్నించాడని, తన భార్య ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవడానికి మీరెవరని అడిగాడని తెలిపారు. తమ ఫోటోలు తీసుకుని, తర్వాత మీ సంగతి చూస్తానని బెదిరించాడని, దీంతో తాము విషయాన్ని పోలీసులకు చెప్పాలని నిర్ణయించామని చెప్పాడు.

అతని ప్రవర్తన తమకు షాక్ కలిగించిందని, ఎవరినైనా కాపాడితే తమకు ప్రశంసలు లభిస్తాయని, కానీ ఇక్కడ మాత్రం తిట్లు ఎదురయ్యాయని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు భర్తపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వీరికి వివాహమై 10 సంవత్సరాలు గడిచిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని విచారణలో తేలింది. తన భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు.

English summary
The Ahmedabad Fire and Emergency Services (AFES) deployed at the Sabarmati Riverfront were in a quandary on Thursday. When a team led by fireman Bharat Mangela foiled a woman's suicide bid, her angry husband allegedly lambasted them for saving her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X