వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేనత్త జయలలిత మరణంపై కోర్టును ఆశ్రయిస్తా: దీపా, సీబీతో విచారణ: స్టాలిన్ డిమాండ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై వాస్తవాలు వెలుగు చూడాలని, అందుకోసం తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అమ్మ మేనకోడలు దీపా జయకుమార్ అన్నారు. జయలలిత మరణంపై మంత్రులు చెబుతున్న వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని దీపా గుర్తు చేశారు.

జయలలిత మృతిపై విచారణకు ప్రత్యేక కమిటీ: హై కోర్టులో పిటిషన్, సీఎం ఇరికించాలని ప్లాన్!జయలలిత మృతిపై విచారణకు ప్రత్యేక కమిటీ: హై కోర్టులో పిటిషన్, సీఎం ఇరికించాలని ప్లాన్!

జయలలిత మరణంపై వాస్తవాలు ఇంకా ఎన్ని రోజులు దాచి పెడుతారో తాను చూస్తానని, అన్ని బయటకు వస్తాయని దీపా అన్నారు. మా మేనత్త జయలలిత మరణంపై మిస్టరీ బయటకు వచ్చే విధంగా తాను కోర్టును ఆశ్రయిస్తానని దీపా జయకుమార్ పేర్కొన్నారు.

Angry J Deepa threatens to go to court over Jayalalithaas death

మేనత్త జయలలిత మరణంపై వెయ్యి అనుమానాలు ఉన్నాయని, ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని, మంత్రులే స్వయంగా ఆ వివరాలు చెబుతున్నారని, మొత్తం బయటకు వచ్చే వరకు తాను నిద్రపోనని దీపా సవాలు చేశారు. జయలలిత మరణంపై పూర్తి వివరాలు బయటకు రావాలంటే వెంటనే విచారణ కమిషన్ వెయ్యాలని దీపా డిమాండ్ చేశారు.

జయలలిత చికిత్స సీసీటీవీ క్లిప్పింగ్స్ విడుదల చేస్తాం: అయితే ఒక్క కండీషన్, డ్రామాలు!జయలలిత చికిత్స సీసీటీవీ క్లిప్పింగ్స్ విడుదల చేస్తాం: అయితే ఒక్క కండీషన్, డ్రామాలు!

జయలలిత మరణంపై పూర్తి వివరాలు బయటకు రావాలంటే వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని తమిళనాడు శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు. జయలలిత మరణంపై వాస్తవాలు బయటకు రావాలంటే వెంటనే విచారణ కమిషన్ ఏర్పాటు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తిరునావుక్కరసన్ డిమాండ్ చేశారు.

English summary
Late chief minister and AIADMK general secretary J Jayalalithaa's niece Deepa Jayakumar, said that she would file a case in the court, seeking a fair probe into the medical treatment and death of her aunt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X