• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. ప్రియుడు భార్య, ఏడేళ్ల కూతురిని... కత్తితో పొడిచి....

|

అమృత్‌సర్ : వారిద్దరికీ పెళ్లయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారి బుద్ధి తప్పింది. పెళ్లై భార్య, భర్త, పిల్లలు ఉన్న వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈ విషయం అతని భార్యకు తెలిసి రగిలిపోయింది. భర్తతో వాదించింది. ఆమెతో ఎడమొహం పెడమొహంగా ఉంటోంది. తమ అక్రమ బంధానికి అడ్డొస్తున్నారనే నెపంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కోపం నశాళానికి ఎక్కింది. తనకు అడ్డుగా ఉన్న ప్రియుడి భార్యను మట్టుబెట్టాలనుకొంది. అందుకోసం ప్రణాళిక రచించి .. అమలు కూడా చేసింది.

రెండు కుటుంబాల్లో ..

రెండు కుటుంబాల్లో ..

అమృత్‌సర్ ప్రీత్‌నగర్‌లో కమలేశ్ రాణి ఉంటుంది. ఈమెకు భర్త రామ్, ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. సొంత ఇల్లు ఉండటంతో సంసారం సాఫీగా సాగిపోతుంది. అయితే వారి ఇంట్లో అద్దెకు ఉండేందుకు దేవ్ ఆనంద్ రాయ్ వచ్చాడు. ఇతను ఇండో టిబెటన్ సరిహద్దులో పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పాటియాలాలో పనిచేస్తున్నారు అతనికి కూడా పెళ్లయింది. ఏడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే దేవ్, రాణి మధ్య అతి చనువు వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి దేవ్ భార్య సుమన్ .. హెచ్చరించింది. దీంతో దేవ్ కాస్త దూరంగానే ఉంటున్నారు. దీంతో రాణికి అనుమానం వచ్చింది.

పరిచయం కాస్త ..

పరిచయం కాస్త ..

అంతకుముందు రాణి, సుమన్ మాట్లాడుకునే వారు. కానీ ఈ మధ్య మాటలు లేకుండా పోయాయి. ఈ క్రమంలో ఏం చేయాలని ఆలోచించింది రాణి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న సుమన్‌ను తొలగించుకోవాలని భావించింది. పక్కా ప్రణాళికతో నిన్న రాత్రి సుమన్ ఇంట్లోకి వెళ్లిపోయింది. వెంట వెళ్లేప్పుడు పదునైన కత్తి కూడా తీసుకెళ్లింది. మమూలుగా మాటలు కలిపి .. దేవ్ విషయం తీసింది. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగింది. అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తి తీసి .. సుమన్‌పై దాడిచేసింది. దీంతో ఆమె అరిచింది. అక్కడే ఉన్న ఏడేళ్ల కూతురు ఏం చేయొద్దని కోరింది. కానీ ముందు సుమన్, తర్వాత చిన్నారిపై దాడి చేసింది రాణి. తర్వాత వారిద్దరి మృతదేహాలను తీసుకొని ఆటోరిక్షాలో తరలించింది. అమృత్‌సర్ చెరువులో వారిద్దరి మృతదేహాలను పడేసింది.

హతమార్చి ..

హతమార్చి ..

తర్వాత రాణి .. రైల్వేస్టేషన్ వెళ్లిపోయింది. తన ముగ్గురు పిల్లలను తీసుకొని రావడంతో భర్త రామ్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమన్ ఆమె కూతురును మట్టుబెట్టిన రాణిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ హత్యలపై విచారిస్తున్నామని పేర్కొన్నారు. రాణికి సాయం చేసిన ఆటో రిక్షా డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. సుమన్ భర్త, రాణి లవర్ దేవ్ ఆనంద్ రాయ్ ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a woman killed her lover's wife and seven-year-old daughter with a sharp-edged weapon and then dumped their bodies in an Amritsar pond, police sources told. The woman is married and has three sons. The incident happened in Preet Nagar area under Mokhampura police station of Amritsar on Tuesday night. Police officials said the accused women, identified as Kamlesh Rani, was having an illicit affair with her tenant Dev Anand Roy who works with Indo-Tibetan Border Police and is currently posted in Patiala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more