వేదనతో నిద్ర పోలేదు .. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఒకరోజు నిరాహార దీక్ష
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ బిల్లుపై రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చెయ్యటం , ఆతర్వాత జరుగుతున్న పరిణామాలు తెలిసిందే . ఇప్పుడు ఎంపీల తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్ తాజాగా నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు .
వ్యవసాయ బిల్లుపై కేసీఆర్ కు జంతర్ మంతర్లో ధర్నా చేసే దమ్ముందా .. రేవంత్ సవాల్ .. ఉత్తమ్ ఫైర్

సస్పెండ్ అయిన ఎంపీలకు టీ ఇచ్చిన కాసేపటికే ..
రాజ్య సభలో వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు . అయితే వారు పార్లమెంట్ ప్రాంగణంలోనే నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ రాత్రంతా వారు పార్లమెంటు ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్షను కొనసాగించారు. ఇక వారికి మద్దతుగా పలువురు లోక్సభ, రాజ్యసభ సభ్యులు సైతం దీక్షలో పాల్గొన్నారు .నిరసన వ్యక్తం చేస్తున్న ఎనిమిది మంది రాజ్యసభ ప్రతిపక్ష సభ్యులను కలుసుకుని, వారికి టీ అందించిన కొద్దిసేపటికే హరివంశ్ తాను ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.

ఎంపీల ప్రవర్తనకు నిరసనగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఒక రోజు నిరాహార దీక్ష
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఎంపీల ప్రవర్తనకు నిరసనగా ఇవాళ ఉదయం నుంచి 24 గంటల పాటు నిరాహార దీక్షకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులపై ఓటు వేసిన సందర్భంగా పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై ఆయన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కు లేఖ రాశారు .జరిగిన పరిణామాలతో తాను మానసిక వేదనకు గురయ్యారని లేఖలో పేర్కొన్నారు. ఆవేదనలో రాత్రి నిద్ర కూడా పట్టలేదు అంటూ ఆయన లేఖలో తన బాధను వ్యక్తం చేశారు.

రూల్ బుక్ చింపి , టేబుల్ పై నిలబడి అసభ్యంగా ప్రవర్తించారని చైర్మన్ కు లేఖ
ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించాలంటూ హరివంశ్ పేర్కొన్నారు.
అందుకే ఎంపీల అనుచిత ప్రవర్తన కు నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఆదివారం రోజు వ్యవసాయ బిల్లుపై జరిగిన చర్చలో కొందరు రూల్ బుక్ ని చంపి తనపై విసిరారని, మరికొందరు టేబుల్ పై నిలబడి అసభ్య పదజాలం ఉపయోగించారని జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే నిద్ర కూడా పెట్టడం లేదని లేఖలో డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు.

తన నిరాహార దీక్షతో అయినా పశ్చాత్తాపం చెందుతారని ఆశిస్తున్నా అంటూ
తాను చేసే నిరాహార దీక్షతో సభ్యులు కొందరైనా పశ్చాత్తాపం చెందుతారని ఆశిస్తున్నానని ఆయన తన లేఖలో తెలిపారు.
ప్రజాస్వామ్యం పేరుతో ప్రతిపక్ష సభ్యులు హింసాత్మకంగా ప్రవర్తించారని, తనను బెదిరించే ప్రయత్నాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 20న తన ముందు ఏదైతే జరిగిందో, అది హౌస్ గౌరవానికి అనూహ్యమైన నష్టాన్ని కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. తాను జయప్రకాష్ నారాయణ గ్రామానికి చెందిన వాడినని, ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన వాడినని ఆయన పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం బీహార్ నుంచే ప్రారంభమైందని పేర్కొన్న హరివంశ్ ఈరోజు నుండి రేపటి వరకు ,24 గంటల పాటు తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు.