వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకుల ఒత్తిడి: అంబానీ సంచలన నిర్ణయాలు, ఆస్తుల అమ్మకం

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బ్యాంకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది.ఓ వైపు పెరిగిపోతున్న బ్యాంకుల రుణాలపై ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా, బ్యాంకు దిగ్గజాలు సైతం కంపెనీలపై ఒత్తిడి

|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బ్యాంకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఓ వైపు పెరిగిపోతున్న బ్యాంకుల రుణాలపై ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా, బ్యాంకు దిగ్గజాలు సైతం కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి.

ఈ క్రమంలో అనిల్ అంబానీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమ్మర్ అసెట్ సేల్‌ను మరికొంత కాలం కొనసాగించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అంబానీ ఆధ్వర్యంలో ఉన్న కంపెనీల రోడ్డు ఆస్తులను, సముద్రగర్భంలోని వ్యాపారాలను, ముంబై, ఢిల్లీలోని ప్రైమ్ రియల్ ఎస్టేట్ లను విక్రయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది.

Anil Ambani's Summer Asset Sale Expands As Banks Tighten Screws

ఈ డీల్స్‌లో అత్యంత ముఖ్యమైనవి రెండు ఒకటి గ్రూప్‌కు చెందిన ఫోన్ ట్రాన్స్ మిషన్ టవర్లను విక్రయించడం, రెండు తమ వైర్‌లెస్ ఆపరేషన్లను ఎయిర్ సెల్ లిమిటెడ్ లో విలీనం చేయడం.

ఒకవేళ ఈ రెండు డీల్స్ సరిపోకపోతే వారం వ్యవధిలోనే రెండు ఇన్సియల్ పబ్లిక్ ఆఫర్లు చేపట్టాలని గ్రూప్‌కు చెందిన ఫైనాన్స్ యూనిట్లు నిర్ణయించాయి. గ్రూప్ రుణాలను మూడింతలు తగ్గించడానికి 4.5 బిలియన్ డాలర్ల(రూ.29,038కోట్లు) మేర నిధులను సమీకరించాలని అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది.

దేశ చరిత్రలో ఒక కంపెనీ ఇంత పెద్దమొత్తంలో రుణ పునర్వ్యవస్థీకరణకు పాల్పడ్డం ఇదే మొదటిసారిఅని అంబానీ ఈ నెల మొదట్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే.

తన కంపెనీ దీర్ఘకాలంలో వాటాదారుల విలువ పెంచడానికి ప్రయత్నిస్తుందని, అలాగే రుణాలు కూడా పరిమిత స్థాయిలో ఉంచేందుకు కృషి చేస్తుందన్నారు. ఆర్కామ్‌కు ఇప్పటికే రూ.45వేల కోట్ల మేర రుణాలున్నాయి.

English summary
Under pressure from lenders, the restructuring of billionaire Anil Ambani's mobile-to-metro conglomerate is turning into a summer sale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X