వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఫెల్ డీల్: సుప్రీం కోర్టు తీర్పుపై అనిల్ అంబానీ స్పందన

|
Google Oneindia TeluguNews

ముంబై: రాఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పును రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం స్వాగతించారు. ఈ వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానంలో కేంద్రానికి ఊరట లభించిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మోడీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేరకు రఫేల్‌ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, వీటిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను తోసిపుచ్చింది. దీనిపై అనిల్ స్పందించారు.

ఈ వ్యవహారంలో తన కంపెనీపై చేసిన ఆరోపణలు సరికాదని చెప్పారు. రాఫేల్‌ ఒప్పందంపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్లు కొట్టివేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని, తనపై, రిలయన్స్‌ గ్రూప్‌పై చేసిన నిరాధార, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలన్నీ అసత్యమని తేలిందని చెప్పారు.

మోడీకి ఊరట, రాహుల్ గాంధీ అబద్దాలకు సుప్రీం కోర్టు చెంపదెబ్బ: రాఫెల్ డీల్‌పై అమిత్ షామోడీకి ఊరట, రాహుల్ గాంధీ అబద్దాలకు సుప్రీం కోర్టు చెంపదెబ్బ: రాఫెల్ డీల్‌పై అమిత్ షా

Anil Ambani Says Rafale Order Proves Falsity Of Allegations Against Me

శ భద్రతకు కట్టబడి ఉన్నామని చెప్పారు. కీలకమైన రక్షణరంగంలో ప్రభుత్వం చేపట్టిన మేకిన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా విధానాలకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

36 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుందని, ఇందులో భాగంగా భారత్‌లో తన విదేశీ భాగస్వామిగా డసో ఏవియేషన్‌ అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకుని ఒప్పందం చేసుకుందని, భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ పేరును భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని, మరో అవకాశం లేకపోవడంతో డసో.. రిలయన్స్ డిఫెన్స్‌తో ఒప్పందం చేసుకుందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో కలకలం చెలరేగింది. ఇప్పుడు సుప్రీం కోర్టులో మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ వచ్చింది.

English summary
Reliance Group Chairman Anil Ambani welcomed the Supreme Court's judgement on the Rafale jet deal. The top court said there is no reason for the court to sit in judgement on the correctness of the Rs. 59,000-crore deal for 36 fighter jets. Allegations that the government had helped Anil Ambani's Reliance Defence bag the offset contract were also dismissed by the court, which said: "There is no evidence of commercial favouritism." The judges asserted that "perception by individuals cannot be the subject of roving inquiry" by the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X