వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో శాలరీ, నో కమీషన్: అనీల్ అంబానీ సంచలన నిర్ణయం

రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మన్ అనీల్ ధీరూబాయ్ అంబానీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ఎలాంటి జీతం గానీ కమీషన్ గానీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్ ఛైర్మన్ అనీల్ ధీరూబాయ్ అంబానీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి ఎలాంటి జీతం గానీ కమీషన్ గానీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

<strong>పీకల్లోతు కష్టాలు: బాధపడ్డ అనీల్ అంబానీ, జియోతో చిక్కులు, అన్నతో ఓకే</strong>పీకల్లోతు కష్టాలు: బాధపడ్డ అనీల్ అంబానీ, జియోతో చిక్కులు, అన్నతో ఓకే

అప్పుల్లో ఆర్‌కాం

అప్పుల్లో ఆర్‌కాం

వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్‌ను ఆదుకునేందుకే అనీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్ నుంచి జీతం లేదా కమీషన్ గానీ స్వీకరించకూడదని అనీల్ అంబానీ నిర్ణయించుకున్నారని సంస్థ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.

అనీల్ తోపాటు

అనీల్ తోపాటు

వ్యూహాత్మక పరివర్తన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ల బాధ్యతతోపాటు, ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆర్‌కాం మేనేజ్‌మెంట్ కూడా ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. సంస్థ బోర్డు సభ్యులు కూడా 21 రోజుల వేతనం వదులుకోవాలని నిర్ణయించారు.

42వేల కోట్ల అప్పులు

42వేల కోట్ల అప్పులు

డిసెంబర్ 2017 వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ స్పష్టం చేసింది. కాగా, ఈయేడాది చివరి వరకు ఆర్ కాం అప్పు రూ.42వేల కోట్ల అప్పును తీర్చాల్సి ఉంది.

వాటా విక్రయంతో 11వేల కోట్ల రాబడి

వాటా విక్రయంతో 11వేల కోట్ల రాబడి

ఈ క్రమంలో రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఎయిర్ సెల్, బ్రూక్ ఫీల్డ్‌లకు టవర్ యూనిట్ రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌లో 51శాతం వాటాను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీంతో రూ. 11వేల కోట్లు ఆర్ కామ్‌కు లభించనుంది.

English summary
Reliance Communications' Chairman Anil Ambani will not be drawing salary or commission from Reliance Communications (RCom) for this fiscal year, reports CNBC-TV18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X