వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో బర్డ్ ప్లూ, 12 వేల కోళ్లను చంపేసిన అధికారులు, డజన్ల కొద్దీ గబ్బిలాల మృతి, స్థానికుల భయాందోళన.

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటేకేరళలో డజన్ల సంఖ్యలో గబ్బిలాలు మృతిచెందాయి. దీంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏం జరిగిందోనని భయపడిపోయారు. వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరిన అధికారులు.. గబ్బిలాల నుంచి శాంపిల్ సేకరించారు. వాటి మృతికి కాల కారణం కనుక్కొనేందుకు శాంపిల్ ల్యాబ్‌కు పంపించారు.

Recommended Video

Bird Flu Outbreak : డజన్ల కొద్దీ గబ్బిలాల మృతి, స్థానికుల భయాందోళన!! | Oneindia Telugu
గబ్బిలాల మృతి..

గబ్బిలాల మృతి..

కోజికోడ్ జిల్లా కరాసేరీ పంచాయతీ పరిధిలో గల కారిమూల పరసరాల్లో మంగళవారం భారీగా గబ్బిలాలు చనిపోయాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పశుసంవర్దకశాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్‌కు తీసుకెళ్లి.. అక్కడే కాల్చివేశారు. శాంపిల్ రిపోర్ట్ రావడానికి కొద్దిరోజుల సమయం పడుతోందని పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కేవీ ఉమా తెలిపారు.

బర్డ్ ప్లూ..

బర్డ్ ప్లూ..

కరాసేరీ పంచాయతీలో గల పౌల్ట్రీ పామ్‌లో రెండు కోళ్లకు బర్ట్ ప్లూ వ్యాధి సోకింది. ఆ పౌల్ట్రీ ఫామ్‌లో ఉన్న కోళ్లకు హెచ్‌5, హెచ్7 టైప్ ఏ సోకిందని వైద్యులు పేర్కొన్నారు. బర్డ్ ప్లూ అని నిర్ధారణ కావడంతో అధికారులు ఫౌల్ట్రీ ఫామ్, సమీపంలో ఉన్న కోళ్లు, టర్కీ కోళ్లను చంపేశారు. దాదాపు 12 వేల కోళ్లను చంపేశారు. ఆ ఫౌల్ట్రీ ఫామ్‌కు కిలోమీటర్ దూరంలో ఉన్న పక్షులను చంపేసి.. దహనం చేశారు. ప్లూను నివారించేందుకు మిగతా పక్షులను చంపేసినట్టు వివరించారు.

దుకాణాలు కూడా..

దుకాణాలు కూడా..

సమీపంలో ఉన్న కోడి గుడ్లు విక్రయించే దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. బర్డ్ ప్లూ సోకిన పక్షులు చనిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి నష్టపరిహారం అందజేస్తామని కేరళ ప్రభుత్వం హామీనిచ్చింది.

ప్లూ సోకిందా..?

ప్లూ సోకిందా..?

కోజికోడ్‌లోనే కోళ్లకు సంబంధించిన నిపా వైరస్ 2018లో వెలుగుచూసింది. దీంతో ఆ సమయంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మళ్లీ రెండేళ్ల తర్వాత బర్డ్ ప్లూ బయటపడటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే దాని సమీపంలో ఉన్న కారిమూలలో గబ్బిలాలు చనిపోవడంతో వాటికి కూడా బర్డ్ ప్లూ సోకిందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
residents of Karassery panchayat in Kozhikode district of Kerala spent a few tense hours on Tuesday after dozens of bats were found dead in the Kaarimoola neighbourhood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X