వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల్లో సీఎం భార్య పోటీ, ఆస్తులు రూ. 100 కోట్లు: టీవీ చానల్, పరువు, ప్రతిష్ట!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని రామనగర శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి నామినేషన్ పత్రాలు సమర్పించారు. తన ఆస్తి విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని, రూ. 8.14 కోట్లు రుణం ఉందని అనితా కుమారస్వామి తన అఫిడవిట్ లో దృవీకరించారు. అనితా కుమాస్వామి గెలుపును సంకీర్ణ ప్రభుత్వం పరువు ప్రతిష్టగా భావిస్తోంది.

సీఎం రాజీనామా

సీఎం రాజీనామా

గత శాసన సభ ఎన్నికల్లో హెచ్.డి. కుమారస్వామి రామనగర, చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అనంతరం చెన్నపట్టణ నియోజక వర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతూ రామనగర నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కుమారస్వామి రాజీనామాతో ఖాళీ అయిన రామనగర నియోజక వర్గం ఉప ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి పోటీ చేస్తున్నారు.

రూ. 68.79 కోట్లు పెట్టుబడి

రూ. 68.79 కోట్లు పెట్టుబడి

తాను బీఇ విద్యాభ్యాసం చేశానని సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. కస్తూరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లో రూ. 68. 79 కోట్లు పెట్టుబడి పెట్టానని, దానితో పాటు రూ. 17. 6 కోట్లు రుణం ఇచ్చానని అనితా కుమారస్వామి అఫిడవిట్ సమర్పించారు. తన చరాస్తి విలువ రూ. 94 కోట్లు ఉంటుందని, జయనగర 4వ బ్లాక్ లోర రూ. 14 కోట్ల విలువైన భవనం, దోడ్డనకుంటె సమీపంలో రూ. 16 కోట్ల విలువైన భవనం ఉందని అనితా కుమారస్వామి ఎన్నికల కమీషన్ కు దృవీకరించారు.

రూ. 76 లక్షల ఆదాయం

రూ. 76 లక్షల ఆదాయం


2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 76. 35 లక్షల ఆదాయం వచ్చిందని అనితా కుమారస్వామి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు. 2, 660 గ్రాముల బంగారం, 17 కేజీల వెండి, 40 క్యారెట్ల వజ్రాలతో సహ రూ.93. 33 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని, రూ. 8. 29 లక్షల విలువైన ఖరీదైన బైక్, రూ. 20 లక్షల విలువైన కారు ఉందని అనితా కుమారస్వామి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

రూ. 93 కోట్ల అప్పులు

రూ. 93 కోట్ల అప్పులు

వివిధ సంస్థలు, వ్యక్తుల దగ్గర రూ. 93. 39 కోట్లు రుణం తీసుకున్నానని, తన పేరుతో రూ. 42 లక్షల నగదు ఉందని, రూ.1. 90 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని, వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి రూ. 8. 14 కోట్లు రుణం తీసుకున్నానని, ప్రస్తుతం తన చేతిలో రూ. 42 లక్షలు ఉందని అనితా కుమారస్వామి ఎన్నికల కమీషన్ కు అఫిడవిట్ సమర్పించారు.

 పరువు ప్రతిష్ట

పరువు ప్రతిష్ట

సీఎం స్థానంలో రామనగర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి హెచ్.డి. కుమారస్వామి రాజీనామా చేశారు. రామనగర ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన భార్యను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కుమారస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అభ్యర్థిగా (జేడీఎస్) బరిలో దిగిన అనితా కుమారస్వామి గెలుపు కోసం రెండు పార్టీల కార్యకర్తలు ప్రచారం ముమ్మరం చేశారు. అనితా కుమారస్వామి గెలుపు సంకీర్ణ ప్రభుత్వానికి పరువు ప్రతిష్టగా మారింది.

English summary
Ramanagara JDS candidate Anitha Kumaraswamy has filed her nomination and Affidavit of asset to the election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X