వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ సమాధి వద్ద ఉద్రిక్తత: పన్నీరులా యోగా చేయొద్దా.. పోలీసులకు విద్యార్థి దిమ్మతిరిగే ప్రశ్న

దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. నీట్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తోన్న విషయం తెలిసిందే. ఇది తీవ్ర రూపం దాల్చింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. నీట్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తోన్న విషయం తెలిసిందే. ఇది తీవ్ర రూపం దాల్చింది.

విద్యార్థులు వచ్చినప్పుడు 4గురు పోలీసులు

విద్యార్థులు వచ్చినప్పుడు 4గురు పోలీసులు

బుధవారం సాయంత్రం ఉన్నపళంగా సుమారు 200 మంది విద్యార్థులు చెన్నై మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు వచ్చేటప్పుడు కేవలం నలుగురు పోలీసులు మాత్రమే కాపలా ఉన్నారు.

సాధారణ సందర్శకుల్లా లోపలకు వెళ్లారు

సాధారణ సందర్శకుల్లా లోపలకు వెళ్లారు

సాధారణ సందర్శకుల మాదిరిగా లోపలకు ప్రవేశించిన విద్యార్థులు జయలలిత సమాధి ఉన్న ప్రదేశానికి చేరుకొని బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కోరారు.

నీట్‌కు వ్యతిరేకంగా నినాదాలు, బలవంతంగా తరలింపు

నీట్‌కు వ్యతిరేకంగా నినాదాలు, బలవంతంగా తరలింపు

దీంతో విద్యార్థులు నీట్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్‌ కారణంగా ఆత్మహత్యకు బలైపోయిన అనితకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆమెకు నివాళులర్పించారు. కాసేపటికి భారీగా చేరుకున్న పోలీసులు విద్యార్థులను బలవంతంగా తరలించారు.

అరుపులు, నినాదాలతో

అరుపులు, నినాదాలతో

ఈ నేపథ్యంలో విద్యార్థుల అరుపులు, నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. జయలలిత బతికి ఉన్నప్పుడు నీట్‌ ప్రవేశ పరీక్షకు వ్యతిరేక వైఖరి అనుసరించారని, అందుకు తాము ఆమె సమాధి సాక్షిగా నిరసన కార్యక్రమం చేపట్టామని విద్యార్థులు తెలిపారు. ఆమె నాలుగు లేఖలు రాశారన్నారు.

పోలీసులకు దిమ్మితిరిగేలా ప్రశ్నించిన ఓ విద్యార్థి

పోలీసులకు దిమ్మితిరిగేలా ప్రశ్నించిన ఓ విద్యార్థి

జయలలిత సమాధి వద్ద ఉన్న విద్యార్థులను తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఓ విద్యార్థి పోలీసులకు దిమ్మతిరిగే ప్రశ్న వేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలా మేం కూడా ఇక్కడ ఎందుకు మెడియేషన్ చేయకూడదని అని నిలదీశారు.

English summary
Giving a slip to the police who had placed restrictions at the Marina beach, students on Wednesday staged a flash protest at the mausoleum of J Jayalalithaa against NEET.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X