• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంకిదాస్ ఔట్ - ఫేస్‌బుక్-బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ - పబ్లిక్ పాలసీ డైరెక్టర్ పదవికి రాజీనామా

|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ ఇండియా, దక్షిణ, మధ్య ఆసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఫేస్ బుక్ సంస్థలో కీలక పోస్టులో ఉండి.. భారత్ లో బీజేపీ విస్తరణకు సాయం చేశారని, ప్రధానమంత్రి స్థాయికి నరేంద్ర మోదీ ఎదుగుదలకు బాటలు వేశారని, ఇప్పటికీ విద్వేషపూరిత వ్యాఖ్యల విషయంలో కమలనాథులకు కొమ్ముకాస్తున్నదంటూ అంకిదాస్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే.

చైనా ఉక్కిరిబిక్కిరి - భారత్-అమెరికా దోస్తీ ఎఫెక్ట్ - శత్రుత్వ బీజాలు నాటొద్దంటూ అక్కసు

తీవ్రమైన ఆరోపణలు..

తీవ్రమైన ఆరోపణలు..

ఫేస్ బుక్ సంస్థ ద్వారా బీజేపీకి లబ్ది చేకూరేలా అంకిదాస్ వ్యవహరించిన తీరుపై ప్రఖ్యాత వాష్టింగ్టన్ పోస్టు పత్రిక కొద్ది రోజుల కిందట సంచలన విషయాలు బయటపెట్టడం తెలిసిందే. బీజేపీతో, ప్రధాని మోదీతో సాన్నిహిత్యాన్ని ఒప్పుకుంటూ, బహిరంగ వేదికలపైనా దర్శమివ్వడమే కాకుండా, రాజకీయ పరమైన అంశాల నియంత్రణలో ఉద్యోగుల నుంచి అంతర్గతంగా అంకిదాస్ పై ప్రశ్నలు, వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఫేస్ బుక్ ఈ మేరకు ఆమెను పదవి నుంచి తప్పించింది. అంకిదాస్ రాజీనామాపై ఫేస్ బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ మంగళవారం అధికారిక ప్రకటన చేశారు.

ఫేస్ బుక్ విస్తరణలో కీలక పాత్ర..

ఫేస్ బుక్ విస్తరణలో కీలక పాత్ర..

భారత్ లో ఫేస్ బుక్ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి గడిచిన తొమ్మిదేళ్లుగా అంకిదాస్ ఎంతగానో కృషి చేశారని, భారత్ లో సంస్థ కార్యకలాపాలకు సంబంధించి తొలినాళ్లలోనే చేరిన వ్యక్తి ఆమె అని, ఇన్నాళ్లపాటు అంకి అందించిన సేవలకుగానూ ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక బీజేపీతో నేరుగా?

ఇక బీజేపీతో నేరుగా?

ఫేస్ బుక్ ఇండియా పాలసీ హెడ్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత ప్రజాసేవలో జీవితాన్ని కొనసాగించాలని అకిదాస్ భావిస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో కీలక భూమిక పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అంకి.. ఇకపై నేరుగా బీజేపీతో కలిసి పనిచేసే అవకాశాలు లేకపోలేవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలను తొలగించకపోవడంలో అంకిదాస్ వ్యవహరించిన తీరు సంస్థకు చెడ్డపేరు తేవడమేకాకుండా, పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరుకావాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడంతో యాజమాన్యం ఈ మేరకు గౌరవంగా ఆమెను తప్పించింది.

సోషల్ మీడియాలో మోదీ నిప్పురాజేశాం - అంకిదాస్ సంచలన కామెంట్స్ - ఫేస్ బుక్- బీజేపీ ఉదంతంలో ట్విస్ట్

English summary
Ankhi Das, Facebook Inc's public policy director for India, South and Central Asia, has stepped down to pursue interests in public service, the company said in a statement on Tuesday. The resignation comes weeks after Facebook and Das faced questions internally from employees over how political content is regulated in its biggest market, India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X