వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫడ్నవీస్ చర్చలు: నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే గత ఆరు రోజులుగా చేస్తోన్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. లోక్‌పాల్‌ చట్టం తీసుకురావాలని, రైతుల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ ఆయన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 23న దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

 Anna Hazare breaks fast after meeting Devendra Fadnavis

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ గురువారం ఈ దీక్షా శిబిరానికి విచ్చేసి అన్నాతో చర్చలు జరిపారు. వారి మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో ఫడ్నవీస్‌ అన్నా హజారేకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఆరు రోజులుగా దీక్ష చేసిన అన్నా ఐదు కిలోల బరువు తగ్గారని, ఆయన రక్త పోటు పడిపోయిందని హజారే సన్నిహితుడు దత్త ఆవారి తెలిపారు. ఇది ఇలా ఉండగా, సీఎం ఫడ్నవీస్‌పైకి గుర్తు తెలియని షూ విసిరాడు. అయితే, అది ఆయనకు తగలలేదు.

English summary
Social activist Anna Hazare ended his 7-day fast on Thursday after meeting Maharashtra Chief Minister Devendra Fadnavis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X