ఫిబ్రవరి 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి అన్నా హజారే అల్టిమేటం
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మహారాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా మహా వికాస్ అఘాడి సర్కార్ తీసుకువచ్చిన మద్యం పాలసీని తీవ్రంగా తప్పు పట్టారు. వెంటనే ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఫిబ్రవరి 14 నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే హెచ్చరించారు.
సీఎం ఉద్దవ్ ఠాక్రేకి అన్నా హజారే లేఖ
మహారాష్ట్రలోని
మహా
వికాస్
అఘాడి
ప్రభుత్వం
జనవరి
27న
కొత్త
మద్యం
పాలసీని
తీసుకువచ్చింది.
ఈ
కొత్త
మద్యం
పాలసీ
విధానాన్ని
ప్రముఖ
సామాజిక
కార్యకర్త
అన్నా
హజారే
తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నారు.
ఈ
మేరకు
మహారాష్ట్ర
సీఎం
ఉద్దవ్
ఠాక్రేకి
లేఖ
రాశారు.
జనరల్
స్టోర్లు,
సూపర్మార్కెట్లలో
మద్యం
విక్రయించాలని
ప్రభుత్వం
తీసుకున్న
నిర్ణయం
సరైంది
కాదని
పేర్కొన్నారు.
ఇది
రాష్ట్రానికి,
రాష్ట్ర
ప్రజలకు
మంచిది
కాదన్నారు.
దీనికి
బదులు
ప్రజలు
మద్యానికి
బనిసలు
కాకుండా
చర్యలు
తీసుకుంటే
బాగుంటుందని
లేఖలో
సూచించారు.

ఆమరణ నిరాహార దీక్ష
ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త మద్యం పాలసీని ఉపసంహరించుకోవాలని అన్నాహజరే డిమాండ్ చేశారు . కాదని అమలు చేస్తామంటే.. తాను ఆమరణ నిరాహార దీక్ష దిగుతానని సీఎంకు రాసిన లేఖలో అన్నా హజరే పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు లేఖ కూడా రాసినట్లు తెలిపారు. కానీ, ఆయన నుంచి ఇంత వరకు స్పందన లేదని చెప్పారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే..
గతంలో మద్యం షాపుల్లోనే దొరికే వైన్ ను ఇక నుంచి జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్లలో విక్రయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడతున్నాయి. మహారాష్ట్రను మద్యరాష్ట్రంగా ఎంవీఏ ప్రభుత్వం మార్చేసిందని బీజేపీ విమర్శిస్తోంది. అయితే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వైన్ ను సూపర్ మార్కెట్ , జనరల్ స్టోర్స్ లో విక్రయించేలా నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది.