వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
4 కిలోలు తగ్గిన అన్నా హజారే, కేంద్రం దూతగా వచ్చిన గిరీష్ మహాజన్
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నాహజారే చేపట్టిన నిరవధిక దీక్ష కొనసాగుతోంది. సోమవారం నాలుగు రోజుల దీక్ష అనంతరం ఆయన నాలుగు కిలోలు తగ్గారు. రక్తపోటు సాధారణంగా ఉందని ఆయన సహాయకుడు దత్తా చెప్పారు.
మార్చి 23వ తేదీ నుంచి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో హజారే దీక్ష చేస్తున్నారు. ఆయన డిమాండ్లలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస ధర కల్పించాలన్న అంశం కూడా ఉంది. గత ఏడేళ్లుగా ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, అన్నాహజారే వద్దకు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ సోమవారం వచ్చారు. ఆయన కేంద్రం దూతగా వచ్చారు. అన్నా హజారే డిమాండ్లలో చాలావరకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఆయన బహుశా మంగళవారం తన నిరవధిక నిరాహార దీక్షను విరమించుకోవచ్చని మహాజన్ చెప్పారు.