వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆందోళనకు అనుమతివ్వండి: ప్రధాని మోడీకి అన్నా హజారే లేఖ
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హాజరే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రైతులకు చెందిన అంశాలపై ఢిల్లీలో అందోళన చేపట్టేందుకు జన్లోక్పాల్కు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి మోడీని అన్నాహజారే ఆ లేఖలో కోరారు.
మార్చి 23న నిరసన చేపట్టేందుకు ఓ ప్రదేశాన్ని సూచించి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఇదే అంశంపై గత సంవత్సరం నుంచి సంబంధిత శాఖలకు, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాస్తున్నా.. వారి నుంచి ప్రతిస్పందన లేకపోవడంతోనే ప్రధానికే లేఖ రాసినట్లు అన్నా హజారే తెలిపారు.

లోక్పాల్, లోకాయుక్త బిల్లు అమలు చేయాలని ప్రధానికి 43 లేఖలు రాశానని.. ఏ ఒక్కదానికి సమాధానం రాలేదని హజారే తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని కేంద్రం బలహీనపరించిందని ఆయన ఆరోపించారు.