వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
26న చంపేస్తాం: అన్నా హజారేకు బెదిరింపు లేఖ
పుణె: సామాజిక కార్యకర్త, అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారేను జనవరి 26న చంపేస్తానంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు లేఖ పంపాడు. అన్నా చాలా సంపద కూడబెట్టారనీ, ఈ ఆస్తులకు వారసుడెవరో ప్రకటించాలని ఆ వ్యక్తి ఆరోపించాడు.
చేతితో రాసిన ఈ లేఖ నాలుగురోజుల కిందట అన్నా హజారే సొంతూరు మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధిలోని కార్యాలయానికి వచ్చినట్టు అహ్మద్‌నగర్ అదనపు సూపరింటెండెంట్ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అన్నాకు ఇప్పటికే తగినంత రక్షణ కల్పిస్తున్నామనీ, బెదిరింపుల నేపథ్యంలో మరోసారి సమీక్షిస్తామని దేశ్‌ముఖ్ వివరణ ఇచ్చారు. హజారేకు గతంలో కూడా బెదిరింపు లేఖలు వచ్చాయి. తాజాగా వచ్చిన బెదిరింపు లేక 10వది కావడం గమనార్హం.