వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకలో మరో బాంబు పేలుడు..ఈసారి థియేటర్ వద్ద పేలిన బాంబు

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజున జరిగిన మారణహోమం నుంచి ఇంకా తేరుకోకముందే మరో బాంబు పేలుడు ఘటన అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే ఈ బాంబును భద్రతా అధికారులు పేల్చారు. ఈ బాంబును భద్రతా అధికారులు సమక్షంలోనే జరిగిందని శ్రీలంక రక్షణశాఖ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. మోటారు బైకులో ఉన్న ఈ బాంబు పేలిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాంబు పేలుళ్ల తర్వాత తనిఖీలు చేస్తున్న భద్రతా దళాలకు ఓ మోటర్ బైకు కనిపించింది. అందులో ఓ బాంబు ఉన్నట్లు వారు గుర్తించారు.

శ్రీలంక రాజధాని కొలొంబోలోని సవాయ్ సినిమా థియేటర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ బైకును తనిఖీ చేసింది బాంబు స్క్వాడ్. సీటులో ఏదో ఉన్నట్లు గమనించింది సిబ్బంది. అది లోపలే ఇరుక్కుని పోవడంతో వెంటనే బైకును దూరంగా తీసుకెళ్లి పేల్చేశారు. ఇది ఉగ్రవాదులు పేల్చిన బాంబు కాదని భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో పేల్చేశారని అందులో బాంబు ఉందని మంత్రి విజయవర్దనే తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని విజయవర్దనే చెప్పారు.

Another blast in Srilanka, this time in Colombo near Savoy cinema

ఇదిలా ఉంటే ఈస్టర్‌ రోజున శ్రీలంకలో పేలిన వరుస బాంబుల ధాటికి 359 మంది మృతి చెందారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 100 మందిని అరెస్టు చేశారు. పేలుళ్లకు పాల్పడింది తామే అని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌లోని మసీదులో కాల్పులకు ప్రతీకార చర్యగానే శ్రీలంకలో పేలుళ్లు జరిపారని శ్రీలంక అధికారులు తెలిపారు.మొత్తం ఏడుమంది ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. పేలుళ్లకు పాలప్డింది శ్రీలంకలోని రెండు ఇస్లామిస్ట్ గ్రూపులని రక్షణశాఖ మంత్రి విజేవర్దనే పార్లమెంటుకు తెలిపారు.

English summary
There was a controlled explosion outside the cinema, Defence Minister, Ruwan Wijewardene, has confirmed. Pictures shared on social media show a motorbike has been blown up. Sri Lankan police found the scooter to be rigged with explosives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X