వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావ్ లో మరో విషాదం:అత్యాచార బాధితురాలు నిప్పంటించుకొని: 70 శాతం కాలిన గాయాలతో..!

|
Google Oneindia TeluguNews

ఉన్నావ్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. 25 ఏళ్ల అత్యాచార బాధితురాలు తనకు న్యాయం జరగటం లేదంటూ.. ఏకంగా స్థానిక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కార్యాలయం వద్ద తనకు తాను నిప్పంటించుకొని ఆత్యహత్యయత్నానికి పాల్పడింది. అమె శరీరం దాదాపు 70 శాతం మేర కాలిపోయింది. గత పదేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తం అక్టోబర్ రెండున తన పైన అత్యాచారానికి పాల్పడి.. వివాహం చేసుకొనేందుకు నిరాకరించాడని బాధితులు రెండు నెలల క్రితం ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుడు హై కోర్టు నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. దీంతో.. తనకు తానుగా నిప్పు అంటించుకొని బాధితురాలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

పదేళ్లుగా పరిచయం
ఈ వ్యవమారం పైన ప్రాధమిక విచారణ పూర్తి చేసిన పోలీసులు బాధితురాలు..నిందితుడి మధ్య గత పదేళ్లుగా పరిచయం ఉన్నట్లుగా చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదులో..తనను తమ గ్రామానికే చెందిన అవదేశ్ సింగ్ పదేళ్లుగా వేధిస్తున్నాడని పేర్కొంది. పెళ్లి చేసుకోమంటే విభేదించి..తనను చంపేస్తానని బెదిరించాడని చెప్పుకొచ్చింది. తాను పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఎప్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని వివరించింది.

In yet another case of alleged rape and criminal intimidation in Unnao, a 23-year-old woman attempted suicide

ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 30న రాత్రి సమయంలో మరో ముగ్గురితో కలిసి అవదేశ్ సింగ్ తన నివాసానికి వచ్చి తనను చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను రాజీ చేసుకోమని బెదిరిస్తున్నారని...వారితో తనకు ప్రాణ హాని ఉందని బాధితురాలు ఫిర్యాదులో వాపోయింది. ఆ తరువాత బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ నలుగురి మీద ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

ఛార్జ్ షీట్ దాఖలు చేసాం..
బాధితురాలి ఫర్యాదు మేరకు రేపుకు పాల్పడిన వ్యక్తి పైన ఛార్జ్ షీటు దాఖలు చేసాని ఉన్నావ్ ఎస్పీ విక్రాంత్ వీర్ తెలిపారు. అదే సమయంలో నేరపూరితంగా వ్యవహరించిన మరో వ్యక్తి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు చెప్పుకొచ్చారు. బాధితురాలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనేది మెజిస్ట్రేట్ కు ఇచ్చే వాంగ్మూలంలోనే తెలిసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా సింగ్ పైన సెక్షన్ 306 కింద మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. బాధితురాలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందని..వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆమె తల్లి తండ్రులు..ఇద్దరు సోదరులతో కలిసి ఉంటుందని పోలీసులు వివరించారు.

English summary
In yet another case of alleged rape and criminal intimidation in Unnao, a 23-year-old woman on Monday attempted suicide by setting herself on fire outside the Superintendent of Police’s office in Unnao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X