వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోరుబావిలో పడి మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి ..

|
Google Oneindia TeluguNews

చండీగఢ్ : యాజమానుల నిర్లక్ష్యం పసిప్రాణాల పాలిట శాపమవుతున్నాయి. కొందరు తమ భూమిలో వేస్తోన్న బోర్లు ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఎన్ని ఘటనలు జరిగినా .. యాజమానుల్లో భయం, అధికారుల్లో చలనం లేకుండా పోయింది. పంజాబ్‌లో ఓ బాలుడు పడి 24 గంటలైనా తీయకపోవడంతో.. ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

another child down to borewell

బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు
పంజాబ్‌లోని సంగరూర్ జిల్లాలో గల బోరుబావిలో ఫతేవీర్ సింగ్ అనే రెండేళ్ల బాలుడు నిన్న సాయంత్రం పడిపోయాడు. అక్కడ బోరువేశారు .. అయితే నీళ్లు పడకపోవడంతో బట్ట కప్పి ఉంచారు. ఇంతలో ఆటుగా ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అందులో పడిపోయాడు. విషయం తెలిసి బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆ బావి లోతు 150 అడుగులు ఉండగా .. 125 అడుగుల లోతులో బాలుడి ఇరుక్కుపోయాడని అధికారలు గుర్తించారు. బాలుడిని బయటకు తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీలతో సమాంతరంగా మరో గోతిని తవ్వుతున్నారు. అయితే బాలుడి పడి ఒకరోజు పూర్తవడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ గొట్టల ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు.

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
బాలుడిని బయటకు తీసేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ నిపుణుగుల కూడా రంగంతోకి దిగారు. బోరుబావికి సమాంతరం మరో గుంత తవ్వుతున్నారు. కొంచెం లోతు వెళ్లకా .. పైపు ద్వారా బాలుడిని బయటకు తీస్తామని అధికారులు చెప్తున్నారు. బోరుబావి లోపలికి ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే 24 గంటలు గడిచిపోవడంతో బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ బాలుడిని కాపాడేందుకు అధికారులు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు.

English summary
Fatehivir Singh, a two-year-old boy in bore well in ​​Sangarur district of Punjab, fell into the evening yesterday. But there was no bedding. A boy who went to play in the game dropped into it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X