• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ లో మరో కరోనా మెడిసిన్ : జైడస్ కాడిలా 'విరాఫిన్' కు డిసిజిఐ అత్యవసర వినియోగ ఆమోదం

|

భారతదేశంలో మరో కరోనా మెడిసిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. భారతదేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో ఔషధం వినియోగానికి మార్కెట్లోకి రానుంది . జైడస్ కాడిల్లా కు చెందిన విరాఫిన్ పేరుతో మరో ఔషధం అందుబాటులోకి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసిజిఐ.

  Zydus Cadila's Virafin Gets DCGI Nod, Reduces Need For Oxygen Support || Oneindia Telugu

  తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ దందా : సామాన్యుల నిలువుదోపిడీ .. ఒక్క రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఎంతంటే !

   జైడస్ కాడిలా 'విరాఫిన్' కు డిసిజిఐ అనుమతి

  జైడస్ కాడిలా 'విరాఫిన్' కు డిసిజిఐ అనుమతి

  కోవిడ్ 19 కేసుల చికిత్సలో 'విరాఫిన్' వాడకం కోసం ఔషధ సంస్థ జైడస్ కాడిలాకు ఏప్రిల్ 23 న దేశంలోని అపెక్స్ మెడిసిన్ రెగ్యులేటర్ - డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి అత్యవసర వినియోగ అనుమతి లభించింది. సాంకేతికంగా పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా -2 బి అని పిలువబడే విరాఫిన్, కొద్దిపాటి లక్షణాలతో బాధపడుతున్న కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడంలో విజయవంతమైందని నిర్ధారణ అయింది. ఇదే విషయాన్నిజైడస్ సంస్థ ప్రకటించింది.

  విరాఫిన్ తో చికిత్స పొందిన రోగులలో ఆక్సిజన్ వాడకం గణనీయంగా తగ్గింపు

  విరాఫిన్ తో చికిత్స పొందిన రోగులలో ఆక్సిజన్ వాడకం గణనీయంగా తగ్గింపు

  పెగిఫ్ఎన్‌తో చికిత్స పొందిన రోగులలో 91.15% మంది 7 వ రోజు నాటికి ఆర్‌టి-పిసిఆర్ ప్రతికూలంగా ఉన్నారని ,వారికి కరోనా నెగిటివ్ వచ్చిందని నివేదించింది. చికిత్స పొందిన రోగులలో అనుబంధ ఆక్సిజన్ వాడకం గంటలను ఈ మెడిసిన్ గణనీయంగా తగ్గిస్తుందని ఇది తెలిపింది.

  ఔషధ ఆక్సిజన్ యొక్క కొరత వల్ల ఏర్పడిన ఒత్తిడితో కూడిన సరఫరా కారణంగా కోవిడ్-19 పోరాటంలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ మెడిసిన్ అందించనున్నట్లుగా జైడస్ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది.

  విరాఫిన్ యాంటీవైరల్ డ్రగ్ , కరోనా ప్రారంభంలోనే ఇస్తే సత్ఫలితాలు

  విరాఫిన్ యాంటీవైరల్ డ్రగ్ , కరోనా ప్రారంభంలోనే ఇస్తే సత్ఫలితాలు

  దీంతో కరోనా రోగులకు ఆక్సిజన్ వాడకం తగ్గింపు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. విరాఫిన్ యాంటీవైరల్ డ్రగ్. దీని సింగిల్-డోస్ రోగులకు చికిత్సను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. కరోనా సమయంలో ప్రారంభంలో అంటే రోగి పరిస్థితి విషమంగా మారకముందు దీనిని వినియోగిస్తే సత్ఫలితాలను ఇస్తుందని అంటున్నారు . విరాఫిన్ రోగులు వేగంగా కోలుకోవడానికి , చాలా సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఆసుపత్రులలో ఉపయోగం కోసం ఇది వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్‌లో లభిస్తుందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

   కరోనా మధ్య స్థాయి లక్షణాలకు విరాఫిన్ సమర్ధవంతంగా పని చేసే డ్రగ్

  కరోనా మధ్య స్థాయి లక్షణాలకు విరాఫిన్ సమర్ధవంతంగా పని చేసే డ్రగ్

  విరాఫిన్ యొక్క అత్యవసర వినియోగ ఆమోదం భారతదేశంలో తీవ్రమైన కరోనా సెకండ్ వేవ్ మధ్య లభించింది. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో వైద్య సదుపాయాల కొరత , ఆక్సిజన్ కొరత నెలకొంది. అలాగే కరోనా బాధితులకు అందించే మెడిసిన్స్ కు కూడా ఇబ్బంది నెలకొంది . ఇప్పటికే తీవ్రంగా కరోనా బారిన పడిన వారికి రెమిడెసివిర్ ఇంజక్షన్ ఇస్తున్నట్టే , కాస్త మధ్య స్థాయి కరోనాతో బాధ పడేవారికి విరాఫిన్ సమర్ధవంతంగా పని చేస్తుంది . కోవిడ్ చికిత్సలో ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు .

  English summary
  Pharmaceutical firm Zydus Cadila received emergency use approval from the Drug Controller General of India (DCGI) - country's apex medicine regulator - on April 23 for the use of 'Virafin' in treating moderate COVID-19 cases. The company has claimed that "91.15% of patients treated with PegIFN were RT-PCR negative by day 7". "The treatment significantly reduces the hours of supplemental oxygen in the patients," it further added. The reduction in usage of supplemental oxygen, as claimed by Zydus, would come as a relief to states who are struggling in the COVID-19 fight due to the stressed supply of medicine oxygen.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X