వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

BulBul Cyclone: మరో తుఫాను గండం ...ప్రభావం ఎక్కడంటే....

|
Google Oneindia TeluguNews

ఫణి, హుదూద్, హికా, క్యార్ ,మహా తుఫాన్లు నిన్నటి వరకు జనజీవనం అస్తవ్యస్తం చేశాయి. ఇక తాజాగా ఇప్పుడు బుల్ బుల్ తుఫాను మరో భయోత్పాతాన్ని సృష్టించటానికి వచ్చేస్తోంది. ఉత్తర కోస్తా దిశగా 'బుల్‌ బుల్‌' దూసుకు వస్తోంది. 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం బుల్ బుల్ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారి బెంగాల్ వైపు వెళుతుందని వాతావరణ శాఖాధికారులు భావిస్తున్నారు.

గుజరాత్‌కు 'మహా'ముప్పు: బుధవారం తీరం తాకనున్న మహా తుఫానుగుజరాత్‌కు 'మహా'ముప్పు: బుధవారం తీరం తాకనున్న మహా తుఫాను

అండమాన్‌ నికోబార్‌ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్నటికి తీవ్ర వాయుగుండంగా మారింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం ఉత్తర అండమాన్ సముద్రం, ఒడిశాలోని పారాదీప్ ఆగ్నేయంగా 890 కి.మీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు ఆగ్నేయంగా 980 కిలోమీటర్ల దూరంలో ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. ఇది మరో 12 గంటల్లో తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది.

Another cyclone ... Bulbul .. effect in Andaman Islands, west bengal and AP

వాయవ్య దిశ వైపు మెల్లగా కదులుతున్న తుపాన్‌ ఈనె 10వ తేదీ నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. తుపాన్‌ ప్రభావంతో నవంబర్ 06, 07తేదీల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో, నవంబర్ 09వ తేదీన ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాదు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

English summary
The Bull Bull Storm is about to create another threat. Meteorological Department officials are predicting that the Bull Bull Cyclone will occur on Wednesday, November 06, 2019. Weather forecasts are expected to turn into a severe typhoon in the next 24 hours headed towards Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X