వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముఖేశ్ సింగ్, క్యురేటివ్ పిటిషన్, వినయ్ సింగ్ కూడా..

|
Google Oneindia TeluguNews

నిర్భయ కేసులో మరో దోషి ముఖేశ్ సింగ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశారు. ఇప్పటికే మరో దోషి వినయ్ శర్మ కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2012 డిసెంబర్16వ తేదీన ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన ఢిల్లీ కోర్టు నిందితులకు మరణశిక్ష విధించింది. దీనిపై నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టులో అభ్యర్థించిన కింది కోర్టు తీర్పును సమర్థించాయి.

Another death row convict move curative plea in Supreme Court

న్యాయ సమీక్ష..
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాకు మంగళవారం ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీన శిక్ష అమలు చేస్తామని, ఈ లోపు న్యాయ సమీక్ష చేసుకోవాలని దోషులకు సూచించింది. దీంతో వినయ్ శర్మ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశారు. అతని తర్వాత ముఖేశ్ సింగ్ కూడా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఆయా కేసు/ఉరి శిక్షకు సంబంధించి క్యురేటివ్ పిటిషన్‌తో చివరి చట్టపరమైన పరిష్కారం పొందొచ్చు. దీంతో దోషులు ఇద్దరు క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.

పరిస్థితుల అంచనా
తన పిటిషన్‌లో వినయ్ శర్మ చిన్న వయస్సులో చేసిన తప్పుగా పరిగణించాలని కోరారు. అయితే పిటిషనర్ యొక్క సామాజకి ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పోషణకు పెద్ద దిక్కు తదితర అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుంది. జైలులో మంచి ప్రవర్తణ ఉంటే కూడా పరిశీలించి ఆ మేరుకు తీర్పునిచ్చే అవకాశాలు ఉంటాయి.

న్యాయం జరిగింది...
నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు ఉరి శిక్ష విధించే తేదీ ఖరారు చేయడంపై ఆమె తల్లి హర్షం వ్యక్తం చేశారు. తన బిడ్డ చావుకు ఏడేళ్లకు న్యాయం జరగబోతోందని చెప్పారు. తనకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరిగిందని చెప్పారు.

English summary
Mukesh Singh, one of the four men sentenced to death in the Nirbhaya gang rape and murder case, filed the curative petition in the Supreme Court on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X