త్వరలో మోడీ ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం!: ఆ చారిత్రాత్మక నిర్ణయం అదేనా?
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల కోసం పెద్ద నిర్ణయం తీసుకోనుందా? రైతులు ఆదాయాన్ని పెంచేందుకు చారిత్రక ప్రకటన చేయనుందా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేత ఒకరు. బీజేపీ రైతు సంఘం అధ్యక్షులు వీరేంద్ర సింగ్ శుక్రవారం మాట్లాడుతూ.. రైతులకు, గ్రామీణ ప్రాంతానికి, వ్యవసాయ రంగానికి లాభం చేకూరేలా కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకోనుందన్నారు.
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఇప్పటికే అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. రైతుల సమస్యలకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఆయన అన్నారు. అందుకే రైతుల శ్రేయస్సు, అభివృద్ధి కోసం కేంద్రం త్వరలోనే పెద్ద నిర్ణయం తీసుకోనుందన్నారు.

దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి కింద ఏటా కొంత మొత్తం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై ప్రభుత్వం నుంచి ఇంత వరకు స్పష్టత రాలేదు. తాజాగా వీరేంద్ర సింగ్ వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకసభ ఎన్నికల ముందే కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్నది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. జీఎస్టీతో సామాన్యులకు ఊరట లభించిందని అంటున్నారు. ఆ తర్వాత జీఎస్టీలో 28 శాతం స్లాబ్‌లో ఉన్న వాటిని కూడా క్రమంగా తక్కువ స్లాబ్‌లోకి వేస్తూ ప్రజలకు ఊరట కల్పిస్తున్నారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications