వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాందాసోర్ లో మరో రైతు మృతి, నిరహరదీక్షకు శివరాజ్ సింగ్ చౌహన్ రెఢీ

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందాసోర్ లో మరో రైతు మరణించాడు. బందావన్ గ్రామానికి చెందిన ఘనశ్యామ్ ధాకడ్ అనే 26 ఏళ్ళ వయస్సున్న రైతు మరణించడంతో మాందాసోర్ లో మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందాసోర్ లో మరో రైతు మరణించాడు. బందావన్ గ్రామానికి చెందిన ఘనశ్యామ్ ధాకడ్ అనే 26 ఏళ్ళ వయస్సున్న రైతు మరణించడంతో మాందాసోర్ లో మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది.

తీవ్రగాయాలతో ఉన్న ఘనశ్యామ్ ధాకడ్ అనే 26 ఏళ్ళ రైతును కర్వ్యూ పాక్షికంగా సడలించడంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు. మాందాసోర్ జిల్లాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

shivarajsingh chowhan

రక్షకభటులు తీవ్రంగా కొట్టడంవల్లే ఘనశ్యామ్ మరణించాడని రైతులు ఆరోపిస్తున్నారు.అయితే ఘనశ్యామ్ మరణించిన ఘటనపై విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం గుడికి వెళ్ళేందుకు ఘనశ్యామ్ వెళ్తుండగా పోలీసులు చుట్టుముట్టి అతడిని చితకబాదారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మాందాసోర్ లో ఉద్రిక్తతలు తలెత్తిన ప్రాంతానికి కొత్తగా నియమితులైన ఎస్పీ, జిల్లా కలెక్టర్ లు చేరుకొన్నారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు.ఆగ్రహంతో ఉన్న రైతును శాంతింపజేసేందుకు అధికారులు ప్రయత్నించారు.

అయితే రైతులు మాత్రం శాంతించలేదు. మరణించిన ముగ్గురు రైతుల కుటుంబాలకు చెందిన సహచరుల ఆచూకీ కూడ లభ్యం కాలేదని వారు కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళారు.దినేష్ మాల్వి, శివనారాయణ మాల్వి, గణేష్ మాల్విల ఆచూకీ దొరకడం లేదని రైతులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపి సజ్జన్ సింగ్ వర్మ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పోలీసులే రైతులను చంపారని ఆయన ఆరోపించారు.

దీక్షకు దిగనున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కఠిన నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్రంలో రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలన్నారు. తాను శనివారం నుండి నిరవధిక నిరహరదీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. శనివారం ఉదయం 11 గంటల నుండి మాందసోర్ లో రైతులపై జరిగిన పోలీసుల కాల్పుల ఘటనపై ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు.

English summary
Tempers ran high in Mandsaur on Friday once again after another farmersuccumbed to his injuries. The 26-year-old resident of Badavan villagewas found with injuries that locals allege was a result of an assaultbythe police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X